365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నేషనల్,సెప్టెంబర్ 5,2022:పొద్దున్నే నిద్రలేవగానే కొంతమందికి బెడ్ కాఫీ తాగకుండా అసలు ఉండలేరు. కాఫీ ప్రియులు తమ రోజువారీ పనులను చక్కని, చిక్కని కాఫీ తాగడంతోనే మొదలు పెడుతుంటారు. కేవలం కాఫీ ప్రియులేకాదండీ..టీ తాగేవాళ్ళు కూడా కాస్త తేనీరు గొంతులోకి దిగాకగానీ తమ పనులను మొదలు పెట్టారు మరి.. ! అంతగా కాఫీ, టీలతో కనెక్ట్ అయ్యి ఉంటారు.

ప్రపంచంలో ఎక్కువగా అంటే చిన్నా,పెద్ద అనే భేదం లేకుండా అందరూ తాగే పానీయాలేవైనా ఉన్నాయా అంటే అవి కాఫీ, టీలే..! ఇద్దరు ఫ్రెండ్స్ కలిశారంటే చాలు ఫస్ట్ కాఫీ లేదా టీ తాగుదామా..? అని..అడుగుతుంటారు.. అతిధులెవరైనా ఇంటికి వచ్చినా మొదటగా ఇచ్చేది టీ లేదా కాఫీలే.. ఇవి మెదడును ఉత్తేజ పరిచే పానియాలు మాత్రమేకాదు చల్లని సాయంత్రం పూట కప్పు వేడి వేడి కాఫీ తాగుతూ ప్రపంచాన్ని మైమరిపించే విలాస పానియం కూడా.

ప్రపంచంలో వివిధ దేశాల్లో వీటిని తయారు చేసే పద్ధతులు వేరువేరుగా ఉంటాయి. అందుకే అన్నింటా వీటి రుచి ఒకేలా కాకుండా భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా కాఫీకి ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. ఇటాలియన్ ఎస్ప్రెస్సో కాఫీ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఉదయం నిద్రలేవగానే పొగలుకక్కుతూ నురుగుతో నిండిన కప్పు ఎస్ప్రెస్సో కాఫీ లేకుండా తమ రోజును ప్రారంభించరు. ఇక మెక్సికో, ఫ్రాన్స్, క్యూబాలో కాఫీ తాగని వారుండరంటే అతిశయోక్తి కాదు. మెక్సికన్లు బ్రౌన్ షుగర్‌తో మట్టి కుండల్లో తయారుచేసిన కాఫీని తాగుతారు.

కోల్డ్ కాఫీ.. బ్లాక్ కాఫీ.. ఇలా ఒక్కటీ రెండు కాదు ఎన్నో రకాల వెరైటీలు ఇందులో ఉన్నాయి. టర్కీలో ఓ రకమైన కాఫీ చాలా పాపులర్.. అక్కడి ప్రజలంతా ఎంతో ఇష్టంగా ఆ కాఫీ తాగుతుంటారు.. టర్కీలో ఈ వింతగా ఉండే కాఫీ చిక్కగా, చక్కగా ఉంటుంది. ఈ సాల్ట్ కాఫీని టర్కీ ప్రజలు అమితంగా ఇష్టపడతారు. ఉప్పు కలిపిన కాఫీ తాగడం వల్ల రక్తం నీళ్లలా పలుచగా ఉండకుండా నివారిస్తుంది. ఇప్పుడు వినడానికి ఈ సాల్ట్ కాఫీ అనేది వింతగా అనిపించినా సాల్టెడ్ కాఫీ చరిత్ర చాలా పాతదే.. ఐతే కాఫీలో ఉప్పు నేరుగా కలపకుండా సహజంగా సాల్ట్ కలిసిన నీళ్లను కాఫీలో ఉపయోగిస్తారు.

టర్కీ, హంగేరీ వంటి దేశాల్లో సముద్రం నీరు నదుల్లో కలిసే చోట నుంచి నీటిని సేకరించి తాగునీరుగా మారుస్తారు. ఫలితంగా ఈ నీళ్లలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు నీటిలో కాఫీని కాచినప్పుడు, కాఫీ సహజంగా ఎక్కువ నురుగ వస్తుంది.