365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మే15,2023: సరిహద్దుల్లో భారత సైన్యం మనల్ని కాపాడుతున్న ధైర్యసాహసాల రుణం ఎవరూ తీర్చుకోలేరు. అయితే, భారత ప్రభుత్వం కూడా తన సైనికులకు , వారి కుటుంబాలకు అనేక సౌకర్యాలను అందిస్తుంది, వాటిలో ఒకటి ఆర్మీ క్యాంటీన్.
ఈ క్యాంటీన్‌లో, ప్రతి వస్తువుపై మీకు మార్కెట్ లోలభించే వస్తువుల ధరలతో పోలిస్తే చాలా తక్కువధరలకే ఆయా వస్తువులు దొరుకుతాయి. ఆర్మీ సిబ్బందికి అందింస్తున్న సౌకర్యాన్ని క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ (సీఎస్ డీ) అని అంటారు. దీనిని వాడుక భాషలో ఆర్మీ క్యాంటీన్ అని పిలుస్తారు.

సీఎస్ డీ అంటే ఏమిటి..?
సీఎస్ డీ రక్షణ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది, దీనిలో జవాన్లకు భారత ప్రభుత్వం తక్కువ ధరలకు వస్తువులను అందిస్తుంది. ఆర్మీ క్యాంటీన్ దుకాణాలు అన్ని ప్రధాన సైనిక స్థావరాలలో తెరిచి ఉంటాయి. ,వాటిని సాయుధ దళాల సిబ్బంది నిర్వహిస్తారు. దేశంలోని వివిధ సైనిక స్టేషన్లలో (CSD)ఆర్మీ క్యాంటీన్ డిపోలు ఉన్నాయి. ఇక్కడి నుంచి వస్తువులు యూనిట్ రన్ క్యాంటీన్ల (URC)కు సరఫరా చేస్తారు.
ఎంత మంది ప్రయోజనాలు పొందుతున్నారు..?
ఆర్మీ క్యాంటీన్ నుంచి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సిబ్బంది, వారి కుటుంబాలతో పాటు మాజీ సైనికులు, వారిపై ఆధారపడిన వారితో సహా 1 కోటి మందికి పైగా ప్రజలు ఆర్మీ క్యాంటీన్ల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.
ఈ క్యాంటీన్‌లో ప్రతి చిన్న వస్తువు చాలా తక్కువ ధరకే లభిస్తుంది. లేహ్ నుంచి అండమాన్ వరకు దాదాపు 33 ఆర్మీ క్యాంటీన్ డిపోలు ఉన్నాయి. దాదాపు 3700 యూనిట్ రన్ క్యాంటీన్లు (URC) ఉన్నాయి.

ఏ వస్తువులు తక్కువ..?
కిరాణా వస్తువులు, కిచెన్ ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్, మద్యం, ఆటోమొబైల్స్ వంటి అనేక రకాల వస్తువులు ప్రధానంగా ఆర్మీ క్యాంటీన్‌లో చౌక ధరలకు లభిస్తాయి. ఆర్మీ క్యాంటీన్‌లో కొన్ని విదేశీ వస్తువులు కూడా లభిస్తాయి. ఆర్మీ క్యాంటీన్‌లోని మద్యం, ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువులపై చాలా పెద్దమొత్తంలో రాయితీ ఇస్తారు. లబ్ధిదారులు ఆర్మీ క్యాంటీన్ నుంచి బహిరంగ మార్కెట్‌లో లభించే ఏదైనా వస్తువులను డిమాండ్ చేయవచ్చు.
ఆర్మీ క్యాంటీన్‌లో ఎక్కువ తగ్గింపు ఎందుకు..?
ఆర్మీ క్యాంటీన్‌లో జిఎస్‌టి పన్నులో ప్రభుత్వం 50 శాతం మినహాయింపు ఇస్తుంది. అంటే, 5, 12, 18,28 శాతం ఉన్న GST గరిష్ట రేట్లు ఈ క్యాంటీన్‌లో సగంపైగా తగ్గుతాయి. ఉదాహరణకు, మార్కెట్‌లోని ఏదైనా వస్తువుపై 5% GST విధించినట్లయితే, అది క్యాంటీన్‌కు 2.5% అవుతుంది. ఈకారణంగానే ఇక్కడ వస్తువులు చాలా చౌకగా దొరుకుతాయి.