Fri. Nov 8th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ సెప్టెంబర్ 25,2023: నాలుగు రోజుల వరుస నష్టాల నుంచి స్టాక్‌ మార్కెట్లు కోలుకున్నాయి. సోమవారం బెంచ్‌మార్క్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి.

ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలే వచ్చినప్పటికీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఉదయం ఇంట్రాడే కనిష్ఠాలను చేరుకున్న సూచీలు ఆఖర్లో పుంజుకున్నాయి.

హాంకాంగ్‌, సింగపూర్‌, కొరియా, చైనా మార్కెట్లు విలవిల్లాడాయి. స్థిరాస్తి, వినియోగ వస్తువుల రంగాలు భారత మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిసింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 14 పాయింట్లు పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 21 పైసలు బలహీనపడి 83.15 వద్ద స్థిరపడింది.

క్రితం సెషన్లో 66,009 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 66,082 వద్ద మొదలైంది. 65,764 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,225 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది.

చివరికి 14 పాయింట్లు పెరిగి 66,023 వద్ద ముగిసింది. సోమవారం 19,678 వద్ద ఆరంభమైన నిఫ్టీ 19,601 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. మధ్యాహ్నం 19,734 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది.

ఆఖరికి 19,674 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్‌ 154 పాయింట్ల లాభంతో 44,766 వద్ద ముగిసింది.

నిఫ్టీ 50 అడ్వాన్స్‌ డిక్లైన్‌ రేషియో 24:25గా ఉంది. బజాజ్‌ ఫైనాన్స్‌ (4.49%), బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ (1.97%), టాటా కన్జూమర్‌ (3.17%), అపోలో హాస్పిటల్స్‌ (1.96%), కోల్‌ ఇండియా (1.76%) టాప్‌ గెయినర్స్‌.

హిందాల్కో (2.06%), ఎస్బీఐ లైఫ్‌ (1.77%), ఇన్ఫీ (1.39%), హీరోమోటో (1.63%), ఎం అండ్‌ ఎం (1.25%) టాప్‌ లాసర్స్‌. ఐటీ, మీడియా, ఫార్మా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాల సూచీలు నష్టపోయాయి.

ఫైనాన్స్‌, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ రంగాలు లాభపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్‌ షేర్లు నిఫ్టీకి మద్దతుగా నిలిచాయి. ఇన్ఫీ, రిలయన్స్‌, టీసీఎస్‌ కిందకు లాగాయి.

నిఫ్టీ సెప్టెంబర్‌ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,750 వద్ద రెసిస్టెన్సీ, 19,600 వద్ద సపోర్ట్‌ ఉ న్నాయి. ఇన్వెస్టర్లు స్వల్ప కాలానికి ట్రెంట్‌, ఏసియన్‌ పెయింట్స్‌, ఎస్కార్ట్స్‌, కోల్‌ ఇండియా, టాటా కాఫీ షేర్లను కొనుగోలు చేయొచ్చు.

లిథియం అయాన్‌ సెల్‌ తయారీ కోసం అల్యూమినియం ఫాయిల్‌ ఉత్పత్తి చేస్తామని శ్యామ్‌ మెటాలిక్స్‌ ప్రకటించింది. ఆదాయపన్ను శాఖ నోటీసులతో డెల్టాకార్ప్ షేర్లు 20 శాతం నష్టపోయాయి. ఎన్‌ఎండీసీలో 14.6 లక్షల షేర్లు చేతులు మారాయి.

ఒక లార్జ్‌ ట్రేడ్‌లో బలరామ్‌పుర్‌ చైనీ మిల్స్‌లో 10 లక్షల షేర్లు చేతులు మారాయి. నాలుగు అతిపెద్ద ట్రేడ్స్‌లో ఐఆర్‌బీ ఇన్ఫ్రాలో 96.2 లక్షల షేర్లు చేతులు మారాయి.

వంద కోట్ల డాలర్ల నిధులు సమీకరిస్తామని చెప్పడంతో బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ధరల పెరుగుతుండటంతో చక్కెర స్టాక్స్‌ 7 శాతం వరకు పెరిగాయి.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709.
error: Content is protected !!