365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 30,2023:దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో సెషన్లో లాభపడ్డాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు ఇన్వెస్టర్లలో పాజిటివ్ సెంటిమెంటుకు దారితీశాయి. నేడు సెన్సెక్స్ 329, నిఫ్టీ 93 పాయింట్ల మేర పెరిగాయి. నిఫ్టీ 19,300 మీద స్థిరంగా కదలాడే వరకు ట్రేడర్లు, ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలి.
చివరి రెండు వారాల్లో అమ్మకాలు పెరగడంతోనే ఇప్పుడు కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.25 వద్ద ఫ్లాట్‌గా స్థిరపడింది. విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలు చేస్తూనే ఉన్నారు.
క్రితం సెషన్లో 48,345 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 48,335 మొదలైంది. గంట సేపటికే 47,926 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. ఆపై క్రమంగా పుంజుకొని 48,697 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది.
చివరికి 258 పాయింట్ల లాభంతో 48,604 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సోమవారం 19,053 వద్ద మొదలైంది. 18,940 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 19,158 వద్ద ఇంట్రాడేలో గరిష్ఠాన్ని చేరుకుంది.
మొత్తంగా 93 పాయింట్లు పెరిగి 19,140 వద్ద క్లోజైంది. ఇక బ్యాంకు నిఫ్టీ 257 పాయింట్ల లాభంతో 43,039 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 50లో 29 కంపెనీలు లాభపడగా 21 నష్టపోయాయి. బీపీసీఎల్, అల్ట్రాటెక్ సెమ్, ఓఎన్జీసీ, రిలయన్స్, ఎస్బీఐ లైఫ్ షేర్లు టాప్ గెయినర్స్‌గా అవతరించాయి.
యూపీఎల్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, ఐచర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంకు టాప్ లాసర్స్. రంగాల వారీగా పరిశీలిస్తే ఆటో, ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎక్కువగా ఎరుపెక్కాయి.
బ్యాంకు, ఫైనాన్స్, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు కళకళలాయి.
నిఫ్టీ నవంబర్ నెల టెక్నికల్ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,300 వద్ద రెసిస్టెన్సీ, 19,150 వద్ద సపోర్టు ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్ప కాలానికి ఎస్బీఐ లైఫ్, గ్రాసిమ్, డీఎల్ఎఫ్, గోద్రేజ్ ప్రాపర్టీస్ షేర్లను కొనుగోలు చేయొచ్చు.
నేడు నిఫ్టీ పెరగడంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులదే ఎక్కువ కాంట్రిబ్యూషన్.
వార్షిక ప్రాతిపదికన యూపీఎల్ క్యూ2 ఆదాయం 18.7 శాతం మేర తగ్గింది. గతేడాది ఇదే సమయంలోని రూ.12,507 కోట్లతో పోలిస్తే రూ.10,170 కోట్లకు తగ్గింది. ఎబిటా ఏకంగా 45.8 శాతం మేర పడిపోయింది.
అదానీ గ్రీన్ ఎనర్జీ అదరగొట్టింది. రెండో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 40.2 శాతం పెరిగి రూ.2220 కోట్లకు చేరుకుంది. ఎబిటా 96.2 శాతం మేర పెరిగింది. గుజరాత్‌లోని దహేజ్‌లో పెట్రోనెట్ ఎల్ఎన్జీ రూ.20,685 కోట్లతో పెట్రో కెమికల్స్ ప్రాజెక్ట్ నిర్మించనుంది.
కంపెనీ రెవెన్యూ రెండో త్రైమాసికంలో 7.5శాతం ఎగిసి రూ.12,533కు చేరింది. అయితే షేరు ధర మాత్రం 9 శాతం పడిపోయింది. ఎన్ఐఐటీ, సుప్రీం ఇండస్ట్రీస్, కల్యాణీ స్టీల్స్, స్ట్రిడ్స్ ఫార్మా, కేపీఐటీ టెక్నాలజీస్ కంపెనీలు ఫలితాలు విడుదల చేశాయి.
- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709