365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 24, 2023: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్తబ్దుగా చలించాయి. సాంతం రేంజ్‌బౌండ్లో కొనసాగి చివరికి నష్టాల్లో ముగిశాయి. ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల సూచీలు కళకళలాడాయి. ఐటీ మాత్రం ఒత్తిడికి లోనైంది.

సెన్సెక్స్ 48, నిఫ్టీ 7 పాయింట్ల మేర నష్టపోయాయి. వచ్చేవారం డెరివేటివ్స్ కాంట్రాక్టుల నెలవారీ ముగింపు ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలే అందాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు బలహీనపడి 83.38 వద్ద స్థిరపడింది.

క్రితం సెషన్లో 66,017 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 66,000 వద్ద మొదలైంది. 66,101 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆపై రేంజ్‌బౌండ్లో కొనసాగింది. 65,894 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 47 పాయింట్ల నష్టంతో 65,970 వద్ద ముగిసింది.

శుక్రవారం 19,809 వద్ద ఆరంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,832 వద్ద ఆరంభమైంది. 19,768 వద్ద కనిష్ఠ స్థాయిని చేరుకుంది. మొత్తంగా 7 పాయింట్లు ఎరుపెక్కి 19,794 వద్ద క్లోజైంది. బ్యాంకు నిఫ్టీ 191 పాయింట్లు ఎగిసి 43,769 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ50లో 17 కంపెనీలు లాభపడగా 33 నష్టపోయాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, సిప్లా, దివిస్ ల్యాబ్, హిందాల్కో, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్. విప్రో, అపోలో హాస్పిటల్స్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, బ్రిటానియా షేర్లు నష్టపోయాయి.

నేడు ఎఫ్ఎంసీజీ, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకు, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్, మెటల్, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, హెల్త్‌కేర్ సూచీలు కళకళలడాయి. నిఫ్టీ నష్టాలు మరింత పెరగకుండా హెచ్‌డీ‌ఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు,యాక్సిస్ బ్యాంకు అడ్డుకున్నాయి.

ఐసీఐసీఐ బ్యాంకు అజయ్ గుప్తను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించింది. హనసా కన్జూమర్ షేర్లు ఇంట్రాడే 14 శాతం పెరిగి ఆల్‌టైమ్ హై‌కి చేరుకున్నాయి. ఎల్ఐసీ షేర్లు 10 శాతం పెరిగి రెండు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి.

ప్రోజీల్ గ్రీన్ ఎనర్జీతో రామకృష్ణ ఫోర్జింగ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆల్కెమ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్, బజాజ్ ఆటో, ఐచర్ మోటార్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, లుపిన్, ట్రెంట్, టీవీఎస్ మోటార్స్ ఇంట్రాడేలో 52 వారాల గరిష్ఠాన్ని చేరాయి. ఇంద్రప్రస్థ గ్యాస్‌తో ఇండస్ఇండ్ బ్యాంకు ఒప్పందం కుదుర్చుకుంది. గతి ఇండస్ట్రీస్ బెంగళూరులో డిస్ట్రిబ్యూషన్ వేర్‌హౌస్‌ను ఆరంభించింది.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709.