Sun. Dec 22nd, 2024

సీఎం జగన్ కు మద్దతుగా నిలుస్తున్నారన్న కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై దాడులు చేయిస్తున్న చంద్రబాబు

ఎన్నికల్లో ఓటమి ఖాయం కావడంతో ఇప్పటికే మహిళలకు అందాల్సిన డీబీటీని అడ్డుకున్న చంద్రబాబు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 8,2024: చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్ర హోంమంత్రి సహా పలువురు మహిళలపై దాడులకు తెగబడుతున్న టీడీపీ క్యాడర్.

  • చంద్రబాబు ఓటమి కళ్లముందు కనిపిస్తోంది. దీంతో ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్కి చేరింది. అదికూడా ఆదశను దాటిపోయి ఒక ఉన్మాదిలా ఆయన తయారయ్యాడు. చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న పనులు అవన్నీకూడా దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
  • గోపాలపురం నియోజకవర్గంలో హోంమంత్రి తానేటి వనితపై దాడి, అలాగే విజయవాడలో మహిళలపై బోండా ఉమ అనుచరుల దాడులు, అటు బనగానపల్లిలో కూడా టీడీపీ నాయకుల దాడులు చూస్తే… చంద్రబాబు ఎలాంటివాడో మరొక్కసారి రాష్ట్ర ప్రజలకు కళ్లముందు కనిపిస్తోంది.
  • ఈ రాష్ట్రంలో జగన్గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మహిళలకు దక్కిన ప్రాధాన్యత గతంలో ఎప్పుడూ, ఎవ్వరూ చేయనిది. డీబీటీ పథకాల్లో కావొచ్చు, మంత్రి పదవుల్లో కావొచ్చు, ఎమ్మెల్యేలుగా, వివిధ నామినేటెడ్ పదవుల్లో వారికిచ్చిన అవకాశాలు అపారం. గతంలో ఏపార్టీకూడా, ఏపార్టీ నాయకుడు కూడా జగన్గారిలా చేయలేదు.
  • అందుకే ఒక్క జగన్గారిని రాజకీయంగా దెబ్బకొట్టడానికి, అందరూ ఏకం అయ్యారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, పరోక్షంగా కాంగ్రెస్ ఇలా అందరూ ఈ ఎన్నికల్లో ఏకం అయ్యారు.
  • కాని జగన్గారికి ప్రజలు అండగా ఉన్నారు. అందరికంటే ఆయన్న అధికంగా ప్రేమిస్తున్న అక్కచెల్లెమ్మలు అండగా ఉన్నారు. ఎక్కడకు వెళ్లినా అక్కచెల్లెమ్మల అండ ఆయనకు స్పష్టంగా కనిపిస్తోంది. మా జీవితాల్లో భరోసాను నింపి మమ్మల్ని అన్నిరకాలుగా ఆదుకుంటున్న జగన్గారికి ఈ ఎన్నికల్లో తమ సంఘీభావాన్ని ప్రకటించేందుకు రాష్ట్రంలో మహిళాలోకం అంతా సిద్ధం అయ్యింది.
  • చంద్రబాబు ఇచ్చిన బూటకపు హామీలను తిప్పికొడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయడానికి మొత్తం మహిళాలోకం ఇవాళ కంకణం కట్టుకుంది. జగన్గారిని కాపాడేందుకు సిద్ధం అయ్యింది.
  • దీన్ని చూసి భరించలేక చంద్రబాబు, ఆకూటమి నేతలు ఫ్రస్టేషన్లోకి వెళ్లిపోయారు. వారి ఫ్రస్టేషన్ ఏ స్థాయిలోకి వెళ్లింది అంటే.. చేయూత, ఆసతరా పథకాలకు డీబీటీని అడ్డుకుని వారి పొట్టకొడ్డమే కాదు, దళిత ఎమ్మెల్యే, సాక్షాత్తూ రాష్ట్ర హోంమంత్రి, సీనియర్ మహిళా నాయకురాలు తానేటి వనతిపై టీడీపీ గూండాలు దాడిచేశారు.
  • ఈ దాడివెనుక చంద్రబాబే ఉన్నారు. తాము ఆశించిన గోదావరి జిల్లాల్లో చంద్రబాబు, పవన్కళ్యాణ్ గిమ్మక్కులు పనిచేడయంలేదని, మహిళలు వారిని దూరంగా పెడుతున్నారని గ్రహించి… వారిని భయ భ్రాంతులకు గురిచేయడానికి ఈ దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు.
  • చంద్రబాబు మహిళా లోకం తరఫున హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే నీ పార్టీని భూస్థాపితం చేశారు. ఇక భవిష్యత్తులో మరెప్పుడూ కూడా మీ పార్టీ లేవకుండా మీ పార్టీలను మహిళలంతా మరింతగా అదఃపాతాళానికి పంపబోతున్నారు. మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.
  • చంద్రబాబూ నీకు మహిళలంటే ఎలాగూ గౌరవం లేదు, నీ దత్తపుత్రుడికి అసలే గౌరవం లేదు… హోంమంత్రిపై దాడికి సంబంధించి మీరు కచ్చితంగా మూల్యం చెల్లించకమానదు. దళిత సోదరీ మణులు, సోదరులు అంతా కూడా ఇప్పటికే ఈ ఘటనపట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారు కూడా మీ పార్టీలకు తగిన బుద్ధిచెప్పేందుకు సిద్ధం అయ్యారు.
  • బోండా ఉమాకు కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం. ఒళ్లు అదుపులో పెట్టుకుని ప్రవర్తించాలి. మహిళలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం.

ఇది కూడా చదవండి:మోసగాడే మొనగాడయ్యాడా ? జగన్ ప్రశ్నలకు మోడీ వద్ద సమాధానాలున్నాయా ?

Also read : YES BANK and EBANX Announce Strategic Partnership to Empower Cross-Border Commerce in India

ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న జియో.

Also read : Party this Weekend with King and DJ Chetas on a cruise! 

ఇది కూడా చదవండి: టీచర్స్ కి క్వెస్ట్ ట్రైనింగ్..లయన్ డా.హిప్నో పద్మా కమలాకర్

error: Content is protected !!