365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 14,2024: ఏఐఎస్ఎస్ఈ (2023-24) బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాల్లో నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు. ఇందుకు కారణమైన ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, సీనియర్ అకాడమిక్ కో-ఆర్డినేటర్, 10వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులను స్కూల్ మేనేజ్‌మెంట్ హృదయపూర్వకంగా అభినందిస్తోంది.
డీపీఎస్, నాచారం 100% ఉత్తీర్ణత శాతాన్ని ప్రకటించడం చాలా గర్వంగా ఉందని యాజమాన్యం తెలిపింది.
ఈ ఫలితాల్లో అభినవ్ చిట్టూరి 98.7శాతం, యుగాంక్ మంత్రి 98.5శాతం, అల్లమనేని అనుశ్రుత్ 98.3శాతం, గడప నిపున్ 98.3శాతంతో పాఠశాల టాపర్లుగా నిలిచారు.
నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 12వ తరగతి విద్యార్థులు అద్భుతాలు సాధించారు. 2023-24 విద్యా సంవత్సరం 100శాతం ఉత్తీర్ణతతో పాటు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఇందుకు కృషి చేసిన ప్రిన్సిపాల్, సీనియర్ వైస్ ప్రిన్సిపాల్, 12వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులను పాఠశాల యాజమాన్యం హృదయపూర్వకంగా అభినందిస్తోంది.
508 మంది విద్యార్థులతో తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద సీనియర్ సెకండరీ పాఠశాలగా డీపీఎస్ నాచారం నిలవడం తమకెంతో గర్వంగా ఉందని స్కూల్ యాజమాన్యం చెప్తోంది. మొత్తం విద్యార్థుల సంఖ్య – 508
స్కూల్ టాపర్స్ :
సైన్స్ టాపర్ – 98.2%తో హనా ఫర్యాల్
హ్యుమానిటీస్ టాపర్ – 97.4%తో ఆస్తా మహేశ్వరి
వాణిజ్యం టాపర్ – 97.2%తో గౌరవ్ సురానా
పాఠశాల ఫలితాల్లోని ముఖ్యాంశాలు :
– 102 మంది విద్యార్థులు 90%, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించారు.
– 141 మంది విద్యార్థులు 80% – 89% మార్కులు సాధించారు.
– 165 మంది 70%- 79% మార్కులు సాధించారు.
– 100 మంది 60% – 69% మార్కులు సాధించారు.
– 23 మంది విద్యార్థులు 9 సబ్జెక్టులలో నూటికి నూరు మార్కులు సాధించారు.
స్కూల్ చైర్మన్ మల్కా కొమరయ్య, డైరెక్టర్ పల్లవి, సీఓఓ మల్కా యశస్వి, ప్రిన్సిపాల్ సునీతరావు, వైస్ ప్రిన్సిపాల్ అంకిత బోస్, సీనియర్ అకాడమిక్ కో-ఆర్డినేటర్ రాధా మాసాపేట, ఉపాధ్యాయుల దూరదృష్టి ఈ ఏడాది అత్యుత్తమ ఫలితాలతో ఫలించింది.
పాఠశాల ఫలితాల్లోని ముఖ్యాంశాలు :
- 208 మంది విద్యార్థులు 90%, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించారు.
- 244 మంది విద్యార్థులు 80-89% మార్కులు సాధించారు.
- 163 మంది విద్యార్థులు 70-79% మార్కులు సాధించారు.
- 97 మంది విద్యార్థులు 60%-69% మార్కులు సాధించారు.
- ఇంగ్లిష్, ఫ్రెంచ్, గణితం, సైన్స్, సోషల్ సైన్స్, తెలుగు, ఐటీ, హిందీలో మొత్తం 43 మంది విద్యార్థులు నూటికి నూరు మార్కులు సాధించారు.
- Aslo read :RJ Malishka, Rajesh Kumar, and KC Shankar step into the shoes of Sarojini Naidu, Liaquat Ali Khan, and VP Menon in Nikkhil Advani’s upcoming series ‘Freedom at Midnight’
- Aslo read : TATA AIG Launches First-of-its-Kind Satellite In-Orbit Third-Party Liability Insurance in India
- Aslo read : Aditya Birla Capital Limited Q4 FY24 financial results..
- Aslo read : TCS To Set UpFirst-of-its-Kind Human-Centric AI Center of Excellencein France
- Aslo read : TIVOLT Electric Vehicles (Murugappa Group venture) set to launch
- Aslo read : SBI becomes the first Bank as Trading cum Clearing Member of IIBX
- కూడా చదవండి: అగ్రిగేటర్ చెల్లింపు లైసెన్స్‌ను RBIకి సరెండర్ చేసిన Zomato పేమెంట్స్..