365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జూలై 8,2024: జులై 6న రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక చైర్మన్, దివంగత ధీరూభాయ్ అంబానీ 22వ వర్ధంతిని పురస్కరించుకుని, డెక్కన్ బ్లడ్ సెంటర్ సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ జియో తెలంగాణ ప్రధాన కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది.
జియో తెలంగాణ సీఈఓ కె.సి.రెడ్డి, ధీరూభాయ్ అంబానీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సంస్థ ఉద్యోగులు సైతం అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రిలయన్స్ ఈ స్థాయిలో ఉండటానికి ధీరూభాయ్ అంబానీ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.
ఒక గ్యాస్ స్టేషన్ అటెండెంట్ నుండి పెట్రోకెమికల్స్, కమ్యూనికేషన్స్, పవర్ మరియు టెక్స్‌టైల్స్ సమ్మేళనం యొక్క యజమాని వరకు ధీరూభాయ్ అంబానీ చేసిన ప్రయాణం తరతరాలకు స్పూర్తినిస్తోంది.
1932లో గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో జన్మించిన అంబానీ తన సోదరుడితో కలిసి బెస్సే అండ్ కోలో పని చేసేందుకు యెమెన్‌లోని ఏడెన్ పోర్టుకు బయలుదేరారు. ఏడెన్‌లో రాజకీయ సంక్షోభం కారణంగా ఆయన కుటుంబం ముంబైకి మకాం మార్చారు.
అక్కడ తన బంధువు చంపక్లాల్ దమానీతో భాగస్వామ్యంతో “మాజిన్” ప్రారంభించారు. కంపెనీ యెమెన్‌కు పాలిస్టర్ నూలు,సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసేది. 1966లో ధీరూభాయ్ రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. మే 8, 1973న అది రిలయన్స్ ఇండస్ట్రీస్‌గా మారింది.