365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 28, 2024: వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ యాజమాన్యం లోని, దానిచే నిర్వహించబడుతున్న మెక్‌డొనాల్డ్స్ ఇండియా (వెస్ట్ &సౌత్) తాజాగా’ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా’ థీమ్‌ను ప్రారంభించడం ద్వారా తన క్లాసిక్ బర్గర్‌లకు ఒక సాహసోపేత కొత్త ట్విస్ట్‌ను జోడించింది. దేశంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల నుంచిసేకరించిన ఏడు వేర్వేరు మిరపకాయల నుంచి ప్రేరణ పొందిన కొత్త రుచితో కంపెనీ తన ఐకానిక్ మెక్‌ఆలూ టిక్కీ, మెక్‌చికెన్, మెక్‌వెగ్గి బర్గర్‌లను తిరిగి రూపొందించింది.

ఈ పరిమిత కాల శ్రేణి బర్గర్‌లు ఇప్పుడు ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా మెక్‌ఆలూ టిక్కీ బర్గర్, ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా మెక్‌వెగ్గి బర్గర్, ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా మెక్‌చికెన్ బర్గర్‌గా ఉన్నాయి. ఇది వాటిని నిజమైన ఇండియన్ బర్గర్‌లుగా మారుస్తుంది.

ఈ కొత్త ఫ్లేవర్‌ భావగ్రి చిల్లీ (గుజరాత్), జ్వాలా చిల్లీ (ఛత్తీస్‌గఢ్ &మధ్యప్రదేశ్), కొల్హాపురి చిల్లీ (మహారాష్ట్ర), గుంటూరు చిల్లీ (ఆంధ్రప్రదేశ్ &తెలంగాణ), బైడ్గి చిల్లీ (కర్ణాటక &గోవా), కంఠారి చిల్లీ (కేరళ), లాంగి చిల్లీ (తమిళనాడు) సరైన మిశ్రమ రుచిని అందిస్తుంది.


ఈ సందర్భంగా మెక్‌డొనాల్డ్స్ ఇండియా (W&S) చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆర్.పి.అరవింద్ మాట్లాడుతూ, ‘‘మెక్‌డొనాల్డ్స్ ఇండియాలో, మా కస్టమర్‌లను ఆహ్లాదపరిచేందుకు, భారతదేశ గొప్ప రుచులను వేడుక చేసుకోవడానికి మేం నిరంతరం మార్గాలను అన్వేషిస్తున్నాం. కొత్త ‘ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా’ మెక్‌ఆలూ టిక్కీ, మెక్‌వెగ్గీ, మెక్‌చికెన్ బర్గర్‌లు మా మెనూను అం దరికీ అందుబాటులోకి వచ్చేలా చేయడంలో,తన అభిమానుల కోసం విలువను సృష్టించడంలోమెక్‌డొనాల్డ్స్ ఇండియా నిబద్ధతను ప్రదర్శిస్తాయని “చెప్పారు.

“వినియోగదారులకు వారి ఇష్టమైన మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌లను ఆస్వాదించడానికి మరిన్ని కారణాలను అందించే మా మార్గం ఇది. ఈ కొత్త పరిమితకాల ఉత్పాదనను పరిచయం చేయడానికి భారతదేశ గొప్ప, విభిన్న రుచులను దేశవ్యాప్తంగా మెక్‌డొనాల్డ్స్ అభిమానులకు అందించడానికి మేం సంతోషిస్తున్నాం’’ అని అన్నారు.

ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా ప్లాట్‌ఫామ్ ఫైరీ రుచులను ఆస్వాదించే కస్టమర్లకు శక్తివంతమైన అనుభవాన్ని అందిస్తుంది. భారతదేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి సేకరించిన ఈ ఏడు మిరపకాయలను చేర్చడం ద్వారా, మెక్‌డొనాల్డ్స్ ఇండియా నిజంగా చేకూర్పు, స్థానిక సంబంధిత మెనూని అందిస్తోంది.

తమకు ఇష్టమైన బర్గర్‌ల రుచిని పెంచే మిరపకాయలు తమ సొంత రాష్ట్రాల నుంచి వచ్చినవని, ప్రాంతీయ అనుబంధం, ప్రామాణికతను సృష్టించే వాస్తవాన్ని కొనుగోలుదారులు గుర్తిస్తారు. ఈ వినూత్న మసాలా మిశ్రమం ద్వారా, మెక్‌డొనాల్డ్స్ ఇండియా భారతీయ వినియోగదారులకు ఫైరీ రుచుల కోసం గల ఆకలిని తీర్చడమే కాకుండా, భారతదేశంలోని విభిన్న మిరపకాయల రుచులను వేడుక చేసుకోవడం ద్వారా విభిన్న వర్గాలతో తన బంధాన్ని బలపరుస్తుంది.

కంపెనీ ‘రియల్ ఫుడ్ రియల్ గుడ్’ని నిజంగా విశ్వసిస్తుంది. అందుకే ఎంచుకున్న మెను ఐటెమ్‌లలో ఎలాంటి కృత్రిమ రంగులు, కృత్రిమ రుచులు, కృత్రిమ నిల్వకారకాలు ఉండవు లేదా చికెన్ ఆఫర్‌లలో యాడెడ్ ఎంఎస్ జి ఉండదు. దాదాపు మూడు దశాబ్దాలుగా, మెక్‌డొనాల్డ్స్ ఇండియా తన విలువైన కస్టమర్లకు తిరుగులేని నాణ్యత, పారదర్శకతకు భరోసానిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సరఫరాదారుల నుండి స్థానికంగా సేకరించబడిన తాజా పదార్థాలను ఉపయోగించేందుకు కట్టుబడి ఉంది.

ఇదికూడా చదవండి:పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు విజయం

ఇదికూడా చదవండి: పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో కవితా పోటీలు..

ఇదికూడా చదవండి: ప‌ద్మ‌శ్రీ అవార్డ్ గ్ర‌హీత డా.సునీతా కృష్ణన్ ఒక సర్వైవరే కాదు ఒక సేవియర్

Also read: Telangana Minister Seethakka hails Padma Sri Awardee Dr. Sunitha Krishnan as ‘”A Savior, Not Just a Survivor”: Releases ‘I Am What I Am’

Also read: Tata Power Solar partners with the Bank of India to provide easy and affordable financing to accelerate  installation of Rooftop Solar and EV Charging Stations

Also read: The Gaudium Hosts Inaugural GYMQUINN 2024: A Landmark 1st All India Level-Wise Gymnastics Tournament in Hyderabad on 27th and 28th July, 2024.