365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 7,2024:ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థలు పోటీపడి ఇటీవల తమ టారిఫ్‌లను పెంచడంతో అసహనం చెందిన కొంత మంది వినియోగదారులు ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ BSNL (బిఎస్ఎన్ఎల్) లోకి మారుతున్నారు.
మార్కెట్లో ప్రైవేట్ కంపెనీలు ఒక వైపు ఒక్కో ప్లాన్ మీద ధరను గరిష్టంగా 25 శాతం వరకు పెంచగా, బిఎస్ఎన్ఎల్ మాత్రం తన టారిఫ్ ను తగ్గిస్తూ ప్రకటన చేసింది. దీంతో కొంత మంది టెలికాం వినియోగదారులు తమ మొబైల్ నెట్వర్క్ ను బిఎస్ఎన్ఎల్ కి మార్చుకోవాలనుకున్నారు.
గత నెల రోజుల కాలంలో దేశ వ్యాప్తంగా కొత్తగా 25 లక్షల మంది బిఎస్ఎన్ఎల్ కనెక్షన్లు తీసుకున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్ టెలికాం సర్కిల్ లో సుమారు 2 లక్షల మంది తమ నెట్వర్క్ లోకి మారినట్లు తెలిపింది.
సిగ్నల్ అందక ఇబ్బందులు
దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో ఇప్పటికే ఆ సంస్థ వినియోగదారులు చాలా కాలంగా అవస్థలు పడుతున్నారు. దీంతో సంస్థ కూడా ఇతర నెట్వర్క్ సంస్థలతో పోటీ పడలేక నష్టాల్లోకి పడిపోయింది.
ప్రధానంగా 2G సేవల మీద ఆధారపడిన బిఎస్ఎన్ఎల్ ఇప్పుడిప్పుడే 4G నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తోంది. మరో వైపు జియో లాంటి పోటీ నెట్వర్క్ ఇప్పటికే నలు మూలలా అత్యాధునిక 4G, 5G సేవలను అందిస్తూ మార్కెట్లో తన నెట్వర్క్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
నెట్వర్క్ చెక్ చేసుకోండిలా
ఇతర నెట్వర్క్ ల నుంచి బీఎస్ఎన్ఎల్ లోకి మారే ముందు మీ ప్రాంతంలో సిగ్నల్స్ ఏ విధంగా ఉన్నాయో పరీక్షించుకోండి. దీనికోసం మీరు మీ మొబైల్ లో గూగుల్ లోకి వెళ్లి www.nperf.com ను ఓపెన్ చేయండి. అందులో coverage map లోకి వెళ్లండి.
Carrier option లో మీరు తెలుసుకోవాలనుకుంటున్న ఆపరేటర్ ను (బిఎస్ఎన్ఎల్ లేదా జియో) సెలెక్ట్ చేసి సెర్చ్ లో మీ ఊరు పేరు ఇచ్చి ఎంటర్ నొక్కండి. దీంతో మీ ఊరు చుట్టూ ఉన్న బిఎస్ఎన్ఎల్ లేదా జియో నెట్వర్క్ సిగ్నల్స్ కనిపిస్తాయి.
గ్రీన్ కలర్ కనిపిస్తే 3G సిగ్నల్స్, ఆరెంజ్ కలర్ కనిపిస్తే 4G సిగ్నల్స్, పర్పుల్ కలర్ కనిపిస్తే 5G సిగ్నల్స్ ఉన్నాయని అర్థం. అసలు ఏ కలర్ కనిపించకపోతే అక్కడ ఆ నెట్వర్క్ కి సిగ్నల్ లేదని అర్థం.
ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుని మీ నంబరు మార్చుకోవడం, లేదా కొత్త కనెక్షన్ తీసుకోవడం మంచిది.
Also read:Mrs Nita M Ambani: “Beyond medals and records, Sport is a celebration of the human spirit”
ఇదికూడా చదవండి:హెచ్ఎన్ఐ/యూఎన్హెచ్ఐ వర్గాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘పయోనీర్ ప్రైవేట్’ ఫైనాన్షియల్ సొల్యూషన్స్‌ను ఆవిష్కరించిన ఇండస్ఇండ్ బ్యాంక్