Wed. Jan 15th, 2025

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,ఆగస్టు 20,2024:: భారతదేశపు అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్, వీసా, మింట్‌ఓక్‌ భాగస్వామ్యంతో నియో ఫర్ మర్చంట్స్‌ను ఆవిష్కరించింది.  

వ్యాపారవర్గాలకు అధునాతన బ్యాంకింగ్ సొల్యూషన్స్‌పరమైన సాధికారత కల్పించడంలో యాక్సిస్ బ్యాంకునకు గల నిబద్ధతకు సంబంధించి ఇదొక కీలక మైలురాయి.

యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్, విశిష్టమైన పేమెంట్ స్వీకరణ ఆప్షన్లు మొదలైన వాటితో నియో ఫర్ మర్చంట్స్ యాప్ అనేది దేశవ్యాప్తంగా వ్యాపారవర్గాలకు సంబంధించిన చెల్లింపుల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేయగలదు.

రిలేషన్‌షిప్ మేనేజర్‌పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా మొబైల్ యాప్ ద్వారా నేరుగా పేమెంట్లు స్వీకరించేందుకు, లావాదేవీ రిపోర్ట్‌లను చూసుకునేందుకు, తమ సర్వీస్ రిక్వెస్ట్‌లను రైజ్ చేసేందుకు వ్యాపారులకు నియో ఫర్ మర్చంట్స్ యాప్ సాధికారత కల్పించగలదు.

పెరుగుతున్న డిజిటలైజేషన్‌ ధోరణులకు అనుగుణంగా రూపొందించిన ఈ వినూత్న విధానం, వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేయగలదు.

వ్యాపారుల అవసరాలు, వారికి ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన యాక్సిస్ బ్యాంకునకు చెందిన నియో ఫర్ మర్చంట్స్ వారికి విస్తృతమైన ప్రయోజనాలు కల్పిస్తుంది.

.సౌకర్యం: వ్యాపారస్తులు కార్డులు, ఎస్ఎంఎస్ పే,యూపీఐ ద్వారా ఎప్పుడైనా చెల్లింపులను స్వీకరించవచ్చు. దీనితో ఇటు కస్టమర్లు అటు వ్యాపారస్తులకు లావాదేవీలపరంగా మెరుగైన అనుభూతి లభించగలదు

.సమర్ధత: మొబైల్ యాప్ ద్వారా పేమెంట్ ప్రక్రియలు, సర్వీస్ రిక్వెస్ట్‌లను క్రమబద్ధీకరిస్తుంది. తద్వారా మర్చంట్లు, సిబ్బందికి సమయం ఆదా చేస్తుంది. ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది.

.డేటా ఇన్‌సైట్స్: అప్లికేషన్ ద్వారా అందుబాటులో ఉండే లావాదేవీ, సెటిల్మెంట్ రిపోర్టులతో వ్యాపారులకు విలువైన వివరాలు తెలుస్తాయి

.యూజర్ ఫ్రెండ్లీ యాప్: భారీ స్థాయి చెల్లింపులు, సర్వీసు సామర్ధ్యాలనేవి పనులను సరళతరం చేసేందుకు, మెరుగైన అనుభూతిని అందించేందుకు, వ్యాపార వృద్ధికి దోహదపడగలవు.

వీసా, మింట్‌ఓక్‌తో భాగస్వామ్యమనేది దేశవ్యాప్తంగా చిన్న, మధ్య తరహా సంస్థలతో సంబంధాలను పటిష్టపర్చుకోవడం, వాటి వ్యాపార వృద్ధికి దోహదపడాలనే బ్యాంకు దార్శనికతకు తోడ్పడగలదు.

“వ్యాపార వ్యయాలను తగ్గించుకోవడంలో, చౌకగా డిజిటల్ పేమెంట్స్‌ను స్వీకరించడంలో మర్చంట్ కమ్యూనిటీకి సహాయకరంగా ఉండే సమగ్రమైన డిజిటల్ సొల్యూషన్స్ అందించడంపై నిరంతరాయంగా పని చేస్తున్నాం.

ఇందులో భాగంగా కొత్తగా ప్రవేశపెట్టిన నియో ఫర్ మర్చంట్స్ అనేది వ్యాపార వర్గాల వ్యాపార అవసరాలన్నింటికీ వన్ స్టాప్ సొల్యూషన్‌లాంటిది” అని యాక్సిస్ బ్యాంక్ ప్రెసిడెంట్ & హెడ్ – కార్డ్స్ & పేమెంట్స్ సంజీవ్ మొఘె తెలిపారు.

వ్యాపారాలు డిజిటైజేషన్‌ను వినియోగించడం పెరుగుతున్న క్రమంలో యాక్సిస్ బ్యాంక్‌తో కలిసి నేటి తరం ఎస్ఎంఈలకు సరికొత్త సాంకేతికతఅధునాతన సొల్యూషన్స్ అందించాలనేది మా లక్ష్యం. పేమెంట్స్, ఫైనాన్స్కామర్స్ విభాగాల్లో వ్యాపారవర్గాల అవసరాలను తీర్చేందుకు నియో ఫర్ మర్చంట్స్ యాప్ ఉపయోగపడగలదు అని మింట్‌ఓక్ సహ-వ్యవస్థాపకుడు. సీఈవో రమణ్ ఖండూజా (Raman Khanduja) తెలిపారు.

“డిజిటల్ ఫస్ట్ ప్రపంచంలో చిన్న వ్యాపారాలు, వర్తకులు మనుగడ సాగించడంలో, పోటీపడటంలో సహాయకరంగా ఉండే పరివర్తనాత్మక మొబైల్ యాప్ – నియో ఫర్ మర్చంట్స్‌ను – యాక్సిస్ బ్యాంక్,మింట్‌ఓక్‌తో కలిసి ప్రవేశపెట్టడం మాకు సంతోషకరమైన విషయం. వీసా శక్తితో,మా క్లయింట్ల దన్నుతో మేము వాణిజ్యం,భవిష్యత్ రూపురేఖలను తీర్చిదిద్దుతాం. అలాగే అన్ని చోట్లా ప్రతి ఒక్కరికి సురక్షితమైన, నిరాటంకమైన పేమెంట్ అనుభూతిని అందిస్తాం” అని వీసా ఇండియా,దక్షిణాసియా హెడ్ (మర్చంట్ సేల్స్ అండ్ అక్వైరింగ్) రిషి చాబ్రా తెలిపారు.

2024 జూన్ నాటికి 20.8% పీవోఎస్ టెర్మినల్ మార్కెట్ వాటాతో దేశీయంగా మర్చంట్ – అక్వైరింగ్ వ్యాపారంలో యాక్సిస్ బ్యాంక్ అతి పెద్ద సంస్థగా ఉంది. దేశవ్యాప్తంగా మెట్రో నగరాలు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రకాల మర్చంట్ల వద్ద 18.67 లక్షల టెర్మినల్స్ ఇన్‌స్టాల్డ్ బేస్ కలిగి ఉంది. గత 12 నెలల వ్యవధిలో (2023 జూన్ – 2024 జూన్) 43 శాతం మార్కెట్ వాటాను బ్యాంకు అదనంగా దక్కించుకుంది.

నియో ఫర్ మర్చంట్స్ గురించి మరింత తెలుసుకునేందుకు, దయచేసి సందర్శించండి: https://www.axisbank.com/business-banking/in-store-payment-acceptance

ఫీచర్లు, వ్యాపారులకు కలిగే ప్రయోజనాలను తెలుసుకునేందుకు; దయచేసి క్లిక్ చేయండి: https://youtu.be/0c5UBbKvaHM?feature=shared

error: Content is protected !!