365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 2024:టెలిగ్రామ్ సీఈవో వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ కస్టడీని ఫ్రెంచ్ అధికారులుపొడిగించారు. టెలిగ్రామ్ వేదికగా క్రిమినల్ నేరాలు మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ చర్యలను అరికట్టడంలో విఫలమయ్యారనే ఆరోపణలతో దురోవ్‌ను పారిస్ సమీపంలోని లే బోర్గెట్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.

ఆదివారం దురోవ్‌ను కోర్టులో హాజరుపర్చగా, కోర్టు అతడి కస్టడీని మరింత కాలం పాటు పొడిగించింది. దురోవ్ ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్నారు. అతను అజర్‌బైజాన్ నుంచి ప్రైవేట్ జెట్‌లో పారిస్‌కు చేరుకున్న సమయంలో ఈ అరెస్టు జరిగింది.

కోర్టు కస్టడీలో గరిష్టంగా 96 రోజులు గడపవలసి ఉండవచ్చని, ఈ కాలానంతరం అతడిని విడుదల చేయాలా లేక మరింత రిమాండ్ చేయాలా అనేది కోర్టు నిర్ణయిస్తుంది.

ఫ్రెంచ్ అధికారుల ప్రకారం, టెలిగ్రామ్‌లో మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదం వంటి నేరాలకు సంబంధించి కొనసాగుతున్న విచారణలో భాగంగా దురోవ్‌కు అరెస్టు వారెంట్ జారీ అయింది.

దురోవ్ టెలిగ్రామ్‌లో జరిగే నేరాలను అడ్డుకోడంలో విఫలమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే, టెలిగ్రామ్ యూరోపియన్ యూనియన్ చట్టాలను డిజిటల్ సేవల చట్టాలను అనుసరిస్తుందని, పరిశ్రమ ప్రమాణాల ప్రకారం కంటెంట్‌ను మోడరేట్ చేస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.

పావెల్ దురోవ్ రష్యా మూలాలతో ఉన్నప్పటికీ, ఫ్రెంచ్ పౌరసత్వం కలిగిఉన్నాడు. ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్నారు, అక్కడే టెలిగ్రామ్ ప్రధాన కార్యాలయం కూడా ఉంది.

2013లో దురోవ్ తన సోదరుడు నికోలాతో కలిసి టెలిగ్రామ్‌ను స్థాపించాడు. ప్రస్తుతం ఇది దాదాపు ఒక బిలియన్ క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది, ముఖ్యంగా ఉక్రెయిన్,రష్యాలో ఉన్నాయి.

దురోవ్ ఆస్తులు సుమారు 1550 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 12.99 లక్షల కోట్లు) విలువైనట్లు అంచనా. 2014లో మాస్కోను విడిచిపెట్టిన దురోవ్, రష్యా ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి, రష్యా ప్రతిపక్షాలకు సంబంధించిన సంఘాలను మూసివేయడానికి నిరాకరించాడు.

2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించినప్పుడు, అత్యంత సెన్సార్ చేయని యుద్ధ సమాచారాన్ని టెలిగ్రామ్ ద్వారా ప్రసారం చేయడం జరిగింది. కొన్ని సమాచారం తప్పుదారి పట్టించేవిగా ఉండటంతో టెలిగ్రామ్ చెల్లించుకుంది.