Sat. Dec 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, సెప్టెంబర్ 2024: భారతదేశంలో అత్యంత పెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్, తన వినియోగదారులకు ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించడానికి ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) పై సంతకం చేసింది.

ప్రారంభంలో స్మాల్ కమర్షియల్ వాహనాలు (SCVలు),లైట్ కమర్షియల్ వాహనాలపై (LCVలు) దృష్టి కేంద్రీకరించబడగా, ఈ భాగస్వామ్యం క్రమంగా టాటా మోటార్స్,మొత్తం వాణిజ్య వాహనాల పోర్ట్‌ఫోలియోకు ఫైనాన్సింగ్‌ను అందించడానికి విస్తరించనుంది.

ఈ సందర్భంగా టాటా మోటార్స్ ఎస్ సీవీ & పీయూ వైస్ ప్రెసిడెంట్ & బిజినెస్ హెడ్ వినయ్ పాఠక్ మాట్లాడుతూ, “ఈ భాగస్వామ్యం, దేశంలోని మారుమూల ప్రాంతాలలోని మా కస్టమర్లకు తిరుగులేని ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించడంలో దోహదపడుతుంది.

ఇది వారి వ్యాపార లక్ష్యాలను చేరుకోవడానికి సాధికారత కల్పిస్తూ, అనుకూల, సమర్థవంతమైన పరిష్కారాలను అందించడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. ఈ సహకారం వ్యవస్థాపకత, ఉద్యోగ అవకాశాలను పెంచడంలో కూడా సహాయపడుతుంది, ముఖ్యంగా మొదటి చివరి-అంచె లాజిస్టిక్స్‌లో” అన్నారు.

ఈ ఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ కుమార్ తమ్టా మాట్లాడుతూ, “టాటా మోటార్స్‌తో భాగస్వామ్యం ద్వారా కస్టమర్లకు అనుకూలమైన ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించడం మాకు ఎంతో సంతోషదాయకం.

వ్యవస్థాపకులకు సాధికారత కల్పించాలనే మా దృక్పథం ఈ భాగస్వామ్యంతో పూరకంగా ఉంటుంది. మా విస్తృత నెట్‌వర్క్, ఆర్థిక నైపుణ్యంతో ఈ భాగస్వామ్యం గణనీయమైన వృద్ధిని ప్రోత్సహించడానికి సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాం” అన్నారు.

టాటా మోటార్స్ 1-టన్ను నుండి 55-టన్నుల కార్గో వాహనాలను,10-సీటర్ నుండి 51-సీట్ల మాస్ మొబిలిటీ ఉత్పాదనలను అందిస్తోంది. చిన్న వాణిజ్య వాహనాలు, పికప్‌లు, ట్రక్కులు, బస్సుల విభాగాలు లాజిస్టిక్స్,మాస్ మొబిలిటీ అభివృద్ధి అవసరాలను తీర్చడానికి రూపొందించబడ్డాయి.

టాటా మోటార్స్ 2500కి పైగా టచ్‌పాయింట్‌ల విస్తృత నెట్‌వర్క్ ద్వారా నాణ్యత,సేవా నిబద్ధతను నిర్ధారిస్తుంది, అలాగే శిక్షణ పొందిన నిపుణుల ద్వారా మద్దతు అందిస్తుంది.

error: Content is protected !!