Thu. Dec 26th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 26,2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఢిల్లీలో గౌరవనీయులైన భారత ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి సంబంధించిన ఏఐఐబీ రుణానికి సంబంధించి కొన్ని మార్పులు కోరారు.

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్ట్ (ఏపీఆర్‌ఆర్‌పీ) కోసం ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) నుంచి తీసుకున్న రుణాన్ని, ప్రాజెక్టును 31 డిసెంబర్ 2026 వరకు పొడిగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ప్రాజెక్ట్‌లో మార్పులు చేయాలని కూడా కోరారు.

ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 31 డిసెంబర్ 2024 వరకు ఇచ్చిన ప్రస్తుత గడువు సరిపోదని చెప్పారు.

రుణ ఒప్పందం ప్రకారం, రీయింబర్స్‌మెంట్ పద్ధతిని కాకుండా ముందస్తు చెల్లింపు పద్ధతిలో రుణం కొనసాగించాలని కోరారు.

ప్రాజెక్టును 2026 డిసెంబర్ వరకు పొడిగించవచ్చని సూచించారు.

నిధుల చెల్లింపుల విధానంలో కూడా మార్పులు చేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న 70% (AIIB) : 30% (AP ప్రభుత్వం) మార్పును 90% (AIIB) : 10% (AP ప్రభుత్వం) చేయాలని, 455 మిలియన్ US డాలర్ల (రూ. 3834.52 కోట్లు) బ్యాంక్ ఒప్పుకొన్న మేరకు వాటాను కొనసాగించి నిధుల విడుదల మార్పుని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

error: Content is protected !!