Thu. Dec 12th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 1,2024: పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్, వట్టే జన్నయ్య యాదవ్, తిరుమణి నాగరాజ్ గౌడ్, కలివేముల మధు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా, బీసీ కుల గణనకు ప్రభుత్వం ప్రస్తుత సహకారం అందించినందుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

పరిస్థితిని గమనించిన ఎమ్మెల్సీ మల్లన్న, బీసీ కులాలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని, గ్రామపంచాయతీ ఎన్నికలలో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించి వారికి సముచిత స్థానం అందించాలని డిమాండ్ చేశారు.

error: Content is protected !!