జి.ఓ నెంబర్ 142 లోని లోపాలను సవరించాలి..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 19, 2025: ప్రజారోగ్య వైద్యులకు నిర్ణీత కాల ప్రొమోషన్లు (టైం బౌండ్ ప్రమోషన్స్) కల్పించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (TGDA) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహతో వెంగళరావు నగర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టినా చోగ్తూ, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్, VVP కమిషనర్ అజయ్ కుమార్, DME వాణి తదితర అధికారులు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరహరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్ మంత్రి దామోదర రాజ నరసింహకు ప్రభుత్వ వైద్యుల సమస్యలను వివరించారు.
ఇది కూడా చదవండి…చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేసిన సంగీత దర్శకుడు మణిశర్మ
Read this also...Melody Brahma Mani Sharma Donates Blood at Chiranjeevi Blood Bank, Expresses Admiration for Megastar
Read this also...Anurag Mehrotra Appointed as Managing Director of JSW MG Motor India
జి.ఓ 142 లోని లోపాలను సవరించాలని డిమాండ్..
జి.ఓ నెంబర్ 142 వల్ల ప్రజారోగ్య వైద్యులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని TGDA నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజారోగ్య వైద్యులకు ప్రమోషన్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు D.M.H.O పోస్టులను మంజూరు చేయాలని, 33 జిల్లాలకు 66 సివిల్ సర్జన్ జనరల్ లైన్ పోస్టులు (33 డీఎంహెచ్‌ఓ + 33 అడిషనల్ డీఎంహెచ్‌ఓ) మంజూరు చేయాలని కోరారు.

మంత్రుల సానుకూల స్పందన..
వైద్యుల సమస్యలపై మంత్రి దామోదర రాజ నరసింహ సానుకూలంగా స్పందించారు. ఒక నెల రోజుల్లో అధికారులకు తగిన ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. క్యాడర్ స్ట్రెంత్ పెంచాలని, సివిల్ సర్జన్ ప్రమోషన్లు వెర్టికల్ సీనియారిటీ ప్రకారం జనరల్ లైన్‌లో ఇవ్వాలని TGDA నేతలు డిమాండ్ చేశారు.
దంత వైద్య నిపుణులను ప్రజారోగ్య విభాగంలోనే కొనసాగించాలి..
TGDA రాష్ట్ర కోశాధికారి డాక్టర్ రవూఫ్ మాట్లాడుతూ, దంత వైద్య నిపుణులను ప్రజారోగ్య విభాగంలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైద్య విధాన పరిషత్‌ను సెకండరీ గ్రేడ్ సర్వీసుగా మార్చాలని TGDA అభిప్రాయపడింది.
అడిషనల్ డైరెక్టర్ ప్రమోషన్లు వేగవంతం చేయాలి..
TGDA రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరహరి మాట్లాడుతూ, అదనపు డైరెక్టర్ ప్రమోషన్లు త్వరగా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో డాక్టర్ దీనదయాళ్, డాక్టర్ కృష్ణా రావు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ వినోద్ బాల్, డాక్టర్ ఖాన్, డాక్టర్ జయలక్ష్మీ, డాక్టర్ శిరీష, డాక్టర్ శోభ, డాక్టర్ చంద్రకళ, డాక్టర్ నవనీత్, డాక్టర్ పవిత్ర, డాక్టర్ గీత, డాక్టర్ సత్యవతి తదితర వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.