365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, పుణె ,ఫిబ్రవరి 20,2025: భారతదేశంలో ప్రముఖ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ వినూత్న రిటైర్మెంట్ ప్లాన్ “బజాజ్ అలయంజ్ లైఫ్ గ్యారంటీడ్ పెన్షన్ గోల్ II” ను ఆవిష్కరించింది.
ఈ నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ఇమ్మీడియట్,డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్ కస్టమర్లకు వారి భవిష్యత్ ఆర్థిక భద్రతను పెంపొందించేందుకు రూపొందించనుంది.
Read this also...Bajaj Allianz Life Launches Guaranteed Pension Goal II with Industry-First 30-Year Deferment Option
Read this also...KBC Global Ltd Approves 1:1 Bonus Issue; Plans Expansion and Debt Reduction
ఇందులో పరిశ్రమలోనే తొలిసారిగా 30 ఏళ్ల డిఫర్‌మెంట్ ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా కస్టమర్లు 35 ఏళ్ల వయస్సు నుంచే తమ రిటైర్మెంట్ ప్రణాళికలను సిద్ధం చేసుకోవచ్చు. యువ ప్రొఫెషనల్స్ రిటైర్మెంట్ ప్లానింగ్ ను త్వరితగతిన ప్రారంభించేందుకు ఈ పెన్షన్ ప్లాన్ దోహదపడుతుంది.

రిటైర్మెంట్ కోసం భారతీయుల్లో పెరుగుతున్న ఆసక్తి
బజాజ్ అలయంజ్ లైఫ్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, 77 శాతం మంది భారతీయులు రిటైర్మెంట్ కోసం జీవిత బీమాకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
భవిష్యత్ ఆర్థిక భద్రత, స్వతంత్రత కోరుకునే వారికి ఈ కొత్త ప్లాన్ ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ముఖ్యంగా ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకునే యువతలో ముందస్తు రిటైర్మెంట్ ప్లానింగ్ పై అవగాహన పెరుగుతోంది.
ఈ క్రమంలో బజాజ్ అలయంజ్ లైఫ్ గ్యారంటీడ్ పెన్షన్ గోల్ II ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. పెద్దసంఖ్యలో ఉన్న భారతీయ మిడిల్ క్లాస్ ప్రజలకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను అందించేందుకు ఈ ప్లాన్ తోడ్పడుతుందని కంపెనీ ఎండీ & సీఈవో తరుణ్ చుగ్ తెలిపారు.
Read this also...“Axis Bank & Hurun India Unveil 2024 List of India’s 500 Most Valuable Private Companies”
ఇది కూడా చదవండి…ప్రజారోగ్య వైద్యులకు టైం బౌండెడ్ ప్రొమోషన్స్ కల్పించాలి: తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం
బజాజ్ అలయంజ్ లైఫ్ గ్యారంటీడ్ పెన్షన్ గోల్ II ప్రత్యేకతలు
బహుళ యాన్యుటీ ఆప్షన్లు – లైఫ్ యాన్యుటీ, జాయింట్ లైఫ్ యాన్యుటీ, రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ (ROP) ఆప్షన్లను అందిస్తుంది.
పరిశ్రమలోనే తొలిసారి 30 ఏళ్ల డిఫర్‌మెంట్ – యువత వీలైనంత త్వరగా రిటైర్మెంట్ ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు అవకాశం.
కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ROP ఎంపిక – 50 శాతం నుంచి 100 శాతం వరకు ROP ని ఎంచుకునే వెసులుబాటు.

జీవిత కాల ఆదాయం – రిటైర్మెంట్ అనంతరం స్థిర ఆదాయం, ఆర్థిక భద్రత.
NPS సబ్‌స్క్రయిబర్స్‌కు ప్రత్యేక ప్రయోజనాలు – జీవిత భాగస్వామి, పేరెంట్స్ సహా డిపెండెంట్లకు ఫ్యామిలీ పెన్షన్ ఆప్షన్.
భారతదేశంలో పెరుగుతున్న లైఫ్ ఎక్స్పెక్టెన్సీ – రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రాముఖ్యత భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ మెరుగుపడటంతో జీవితకాలం 80-90 ఏళ్ల వరకు పెరిగింది.
ఇది కూడా చదవండి…చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేసిన సంగీత దర్శకుడు మణిశర్మ
Read this also...Melody Brahma Mani Sharma Donates Blood at Chiranjeevi Blood Bank, Expresses Admiration for Megastar
Read this also...Anurag Mehrotra Appointed as Managing Director of JSW MG Motor India
అయితే, రిటైర్మెంట్ తరువాత 25-30 ఏళ్ల పాటు క్రమబద్ధమైన ఆదాయం లేకుండా గడపాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
అంతర్జాతీయంగా సోషల్ సెక్యూరిటీ వంటి వ్యవస్థలు ఆదాయం కల్పిస్తున్నా, భారతీయులకు అలాంటి అవకాశాలు లేవు. కాబట్టి స్ట్రక్చర్డ్ రిటైర్మెంట్ సొల్యూషన్స్ అత్యవసరంగా మారాయి.

ఈ నేపథ్యంలో 35 ఏళ్ల వయస్సు నుంచే పొదుపు ప్రారంభించేందుకు బజాజ్ అలయంజ్ లైఫ్ గ్యారంటీడ్ పెన్షన్ గోల్ II ఎంతో దోహదపడుతుంది.
ఈ ప్లాన్ ద్వారా జీవితకాల ఆదాయం, భద్రతతో పాటు, కస్టమర్లకు రిటైర్మెంట్ పై పూర్తి నియంత్రణ ఉంటుంది అని బజాజ్ అలయంజ్ లైఫ్ వెల్లడించింది.
రిటైర్మెంట్ ప్లానింగ్ పై దృష్టి పెట్టాలనుకుంటున్నవారు బజాజ్ అలయంజ్ లైఫ్ వెబ్‌సైట్ లేదా తమ సమీపంలోని ఇన్సూరెన్స్ కన్సల్టెంట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.