365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 9,2025:హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) బృందాలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. ప్రమాదాలు ఎప్పుడు, ఎలా సంభవిస్తాయో తెలియని పరిస్థితుల్లో డీఆర్‌ఎఫ్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడం ద్వారా నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి…సామ్‌సంగ్ బెస్పోక్ ఏఐ లాండ్రీ కాంబోతో స్మార్ట్ హోమ్ విప్లవం..

Read this also…Birla Opus Paints Redefines Interior Luxury with New Range of Designer Finishes

మంగళవారం హుస్సేన్‌సాగర్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ యువతిని కాపాడిన హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందాన్ని కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రశంసించారు. ఈ ఘటనలో మార్షల్ ఫకృద్దీన్, సహాయక సిబ్బంది ఎ. రమేష్, ఎన్. శ్రీనివాస్, ఎండీ ఇమాముద్దీన్, కె. కార్తీక్ కుమార్‌లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యువతిని రక్షించారు.

సాగర్‌లోకి దిగడం కష్టమైన ప్రదేశంలో తాళ్ల సాయంతో ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని కమిషనర్ తెలిపారు.

ఇది కూడా చదవండి…ఇన్‌స్టాగ్రామ్ స్నేహితుడిని పెళ్లి చేసుకోవడానికి భారతదేశంలోని ఈ గ్రామానికి వచ్చిన అమెరికన్ యువతి..

Read this also…National Mart Concludes Festive Dhamaka Lucky Draw with Grand Celebration at Nagaram Store

అంతేకాకుండా, గురువారం కురిసిన భారీ వర్షంతో మూసీ నదిలో వరదలో చిక్కుకున్న ఇద్దరిని కాపాడిన డీఆర్‌ఎఫ్ బృందాన్ని కూడా ఆయన అభినందించారు. వీరి సమయోచిత చర్యలు ప్రశంసనీయమని, ఇలాంటి సంఘటనల్లో డీఆర్‌ఎఫ్ సిబ్బంది చూపే చాకచక్యం వల్ల ప్రజలకు రక్షణ కల్పించవచ్చని ఆయన పేర్కొన్నారు.