365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,గురుగ్రామ్, మే 23,2025: దేశీయ ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్‌ పరిష్కారాల్లో ప్రగతిమార్గంలో ముందున్న ఎక్సికామ్‌, తన నూతన తరం డీసీ ఫాస్ట్‌ ఛార్జర్‌ “హార్మొనీ డైరెక్ట్‌ 2.0”ను అధికారికంగా విడుదల చేసింది. మే నెలలో కంపెనీ నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఉత్పత్తిని ఆవిష్కరించారు.

భారతదేశంలో EV అవలంబనకు ప్రధాన అడ్డంకులైన విశ్వసనీయత, ఆర్థిక సామర్థ్యం, వినియోగదారుల అనుభవం వంటి అంశాలపై దృష్టి సారించి ఈ ఉత్పత్తిని రూపొందించారు.

ఈ ఛార్జర్‌కు ప్రాణాధారంగా హార్మొనీ OS వ్యవస్థ పనిచేస్తోంది. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మొదటి ఛార్జర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌. దీని సహాయంతో కార్-టు-ఛార్జర్-టు-క్లౌడ్ పరస్పర చర్యలు పూర్తి స్వయంచాలకంగా జరిగేలా చూస్తోంది.

అలాగే, ఇందులోని AI ఆధారిత ‘హార్మొనీ కనెక్ట్‌’ టెక్నాలజీ ద్వారా రిమోట్ మానిటరింగ్‌, డయాగ్నస్టిక్స్‌ వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఫలితంగా ఛార్జింగ్‌ స్టేషన్లలో డౌన్‌టైమ్‌ తక్కువగా ఉండి, సేవల నాణ్యత మెరుగవుతుంది.

Read This also…Exicom Unveils Harmony Direct 2.0: A Game-Changer in EV Charging with India’s First Indigenous Charger OS

Read This also…Alembic Pharmaceuticals Receives USFDA Final Approval for Amlodipine and Atorvastatin Tablets..

Read This also…MSME Credit Grows 13% YoY; Delinquencies Hit 5-Year Low..

ఈ సందర్భంగా ఎక్సికామ్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ అనంత్‌ నహతా మాట్లాడుతూ, “హార్మొనీ డైరెక్ట్‌ 2.0ను రూపొందించడంలో మా లక్ష్యం సంప్రదాయ ఛార్జింగ్‌ పద్ధతులకు భిన్నంగా విశ్వసనీయత, ఆర్థిక ప్రయోజనాలు, వినియోగదారులకు మరింత మక్కువ కలిగించే అనుభవాన్ని అందించడం” అని తెలిపారు.

ఇక EVSE విభాగం CEO అన్షుమన్ దివ్యాంశు మాట్లాడుతూ, “ఈ ఛార్జర్‌ ఛార్జింగ్‌ స్టేషన్లకు మాత్రమే కాదు, వాణిజ్య వాహనాల ఫ్లీట్‌ ఆపరేటర్లకు సైతం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది విస్తృత స్థాయిలో సాంకేతిక మేధస్సుతో రూపొందించింది” అని చెప్పారు.

హార్మొనీ డైరెక్ట్‌ 2.0లో ప్లగ్‌ల మధ్య లోడ్‌ షేరింగ్, స్మార్ట్‌ పవర్‌ మేనేజ్‌మెంట్, రియాక్టివ్‌ ఎనర్జీ లాస్‌ నియంత్రణ వంటి అనేక వినూత్న ఫీచర్లు ఉన్నాయి.

అలాగే హార్మొనీ నెట్‌ అనే ప్రత్యేక సాంకేతికతను ప్రవేశపెట్టి, పలు ఛార్జర్లు మధ్య విద్యుత్‌ను సమర్థంగా పంచుకునే వీలును కల్పిస్తోంది. మల్టీ-స్టాక్‌ ఛార్జింగ్‌ వ్యవస్థతో మరింత సౌకర్యవంతమైన చార్జింగ్‌ను అందించనుంది.

ఈ ఛార్జర్‌కు ఉపయోగించే యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగా ఉంటుందని, కేబుల్‌, కనెక్టర్‌లు సులభంగా హ్యాండిల్‌ చేయగలిగేలా డిజైన్‌ చేసినట్లు కంపెనీ తెలిపింది. వాణిజ్య, వ్యక్తిగత వినియోగదారులు ఎవరైనా సులభంగా వినియోగించగలిగేలా తయారు చేశారు.

భారతదేశ EV లక్ష్యాలను చేరుకునేందుకు మౌలిక సదుపాయాల్లో విశ్వసనీయత కీలకం. ఈ నేపథ్యంలో హార్మొనీ డైరెక్ట్‌ 2.0 భారత్‌లో EV మౌలిక వేదికల అభివృద్ధిలో కీలక భూమికను పోషించనుందని ఎక్సికామ్‌ నమ్మకం వ్యక్తం చేసింది.