365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, యురేకా (అమెరికా), జనవరి 4,2025: ఈ నూతన సంవత్సరం సరికొత్త ఆశలతో ప్రారంభమైంది. ప్రపంచదేశాల్లోని ప్రజలు వారి కల్చర్ ప్రకారం 2026 నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు.
ఇదీ చదవండి : హైదరాబాద్ లో 3రోజుల పాటు ఇంటర్నేషనల్ కైట్& స్వీట్ ఫెస్టివల్-2026..
ఇదీ చదవండి : రా అండ్ రూటెడ్ మూవీ ‘దిల్ దియా’ టైటిల్ లాంచ్..!
హంబోల్ట్ కౌంటీలో 2026 సంవత్సరపు తొలి చిన్నారి జన్మించింది. జనవరి 1వ తేదీ ఉదయం 9:04 గంటలకు యురేకాలోని ప్రావిడెన్స్ సెయింట్ జోసెఫ్ ఆసుపత్రిలో ఈ అద్భుత ఘట్టం చోటుచేసుకుంది.
తల్లిదండ్రుల ఆనందం కెల్సీ వాన్ అండ్ బ్రెంట్ రోసిగ్ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించినట్లు ఆసుపత్రి వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ఈ దంపతులకు ఇప్పటికే ముగ్గురు సంతానం ఉన్నారు.
కాగా నాలుగో చిన్నారి రాకతో వారి కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరుతూ, పాప పేరును బహిర్గతం చేయడానికి, మీడియాలో మాట్లాడటానికి తల్లిదండ్రులు నిరాకరించారు.

వైద్యులకు ప్రత్యేక శుభాకాంక్షలు ఏడాది ఆరంభంలోనే ఒక కొత్త ప్రాణం తమ ఆసుపత్రిలో అడుగుపెట్టడంపై వైద్య బృందం సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి :2025లో భారతీయులు గూగుల్లో ఎక్కువగా వెతికిన ఆరోగ్య సందేహాలివే..!
Read this also: Telugu Horror-Mystery ‘Not All Movies Are The Same: Dual’ Set for Multi-Language Premiere on Lionsgate Play..
ఈ ఏడాది కౌంటీలో నమోదైన మొదటి జననం కావడంతో స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది ఈ న్యూ ఇయర్ లో పుట్టిన బేబీకి ఘనంగా స్వాగతం పలికారు.
