Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 10,2024: ఇన్స్టిట్యూట్ అఫ్ బయోటెక్నాలజీ, రాజేంద్రనగర్, హైదరాబాద్ లో రెండు వారాలు పాటు నిర్వహించిన జీవ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని నూతన వంగడాల రూపాకల్పనపై శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది.

ఈ కార్యక్రమంను పి. జె. టి. యస్. ఎ. యూ పరిధిలోని ఇన్స్టిట్యూట్ అఫ్ బయోటెక్నాలజీ వారు టి. స్. కాస్ట్ ఫండ్స్ తో నిర్వహించడం జరిగింది . ఈ ముగింపు కార్యక్రమంకు డా. అహ్మద్ కమల్ , కన్సల్టెంట్ -టి. ఎస్. కాస్ట్ , డా. ఎం. వెంకట రమణ , రిజిస్టార్, పి జె టి ఎస్ యు,.డా. పి. రఘురామి రెడ్డి, డైరెక్టర్ అఫ్ రీసెర్చ్ – పి. జె. టి. స్. ఎ. యూ,

ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా డా. అహ్మద్ కమల్ , మాట్లాడుతు యువ శాస్త్రవేతలు బయోటెక్నాలజీని ఉపయోగించుకొని కొత్త వంగడాలను రూపొందించాలిన్నారు. ముఖ్యంగా ఈ శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని నూతన పరిశోదనాలుగా మల్చన్నారు.

డా. ఎం. వెంకట రమణ మాట్లాడుతూ బ్రీడర్లు చీడ పీడలతో పాటు మారుతున్న వాతావరణ పరిస్థులకు తగ్గటుగా కొత్త పరిశోదనలు కొనసాగించాలన్నారు.డా. పి. రఘురామి రెడ్డి మాట్లాడుతూ నూతన సాంకేతిక పద్ధతులు ఉపయోగించి టిష్యూ కల్చర్ రకాలు,వంగడలు రూపొందించాలిన్నారు.

భవిష్యత్లో బయోటెక్నాలజీకి చాలా డిమాండ్ ఉంటుంది కావున ప్రత్తిలో గులాబీ రంగు పురుగు తట్టుకునే బి. టి ప్రత్తి,వరిలో అగ్గి తెగులు, బాక్టీరియా ఆకు మచ్చ తెగులు, ఉల్లికోడును తట్టుకునే రకాలపై పరిశోదించాలిన్నారు.

ఈ కార్యక్రమంలో *డా. సి. వి. సమీర్ కుమార్ , డైరెక్టర్, ఐ. బి. టి , డా. శాంత కుమారి, ప్రతినిధి -టి ఎస్ కాస్ట్ ,డా. సి హెచ్ అనురాధ, ప్రొఫెసర్, ఐ. బి. టి, వివిధ *వ్యవసాయ, ఉద్యానవన విశ్వ విద్యాలయల శాస్త్రవేతలు 30 మంది పాల్గొన్నారు. ఈ ముగింపు కార్యక్రమంలో శాస్త్రవేతలందరికి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది.

error: Content is protected !!