365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జనవరి11, 2025: అభ్యాస ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ 28వ వార్షిక ఉత్సవంలో భాగంగా శుక్రవారం శిల్ప కళా వేదికపై ‘సంవిధాన్@75’ అనే మెగా థియేటర్ ప్లే (నాటిక) ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రముఖులు పాల్గొన్నారు.
సీఈఓ అండ్ ఫౌండర్ డైరెక్టర్ వినాయక కళ్లెట్ల మాట్లాడుతూ, “విద్య అనేది కేవలం పాఠశాలలు, కళాశాలలకే మాత్రమే పరిమితం ఉండకూడదు. ఇది జీవితాంతం అభ్యాసంగా మారాలి. కోవిడ్ అనంతరం రెసిడెన్షియల్ స్కూల్ విద్య క్షిణిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో విద్యార్థులకు సురక్షితమైన పాఠశాల వాతావరణం అందించడం ఎంతో ముఖ్యమని అన్నారు.”
పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ మాట్లాడుతూ, “మార్కులు మాత్రమే కాదు, సమాజంలో విద్యార్థులు వదిలే ‘మార్క్’లు ముఖ్యం. ప్రాచీన భారతీయ విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు, మానవీయ గుణాలను మన విద్యార్థులకు నేర్పాలి,” అని పేర్కొన్నారు. కరుణా గోపాల్ మాట్లాడుతూ, “భారతదేశం అనేది ప్రపంచంలో ముందుకు సాగిపోతున్న ఒక అద్భుతమైన దేశంగా మారుతోంది. ఇప్పుడు మన దేశం అన్ని కోణాలలో ఆచరణలో ఉన్నదని,” అన్నారు.
90 నిమిషాల ఒపెరా(నాటిక) లో పాఠశాలలోని మొత్తం 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఒకే వేదికపై చాలా మంది విద్యార్థులు పాల్గొనడం అరుదైన విషయం.
5000 BCE నుంచి భారతదేశ చరిత్రను గుర్తించింది, భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు నిండి 2025 జనవరి 26వ తేదీన భారత రిపబ్లిక్ 75 సంవత్సరాలు అవుతుంది. ఈ మైలురాయి సందర్భానికి ముందు ఒపెరా ప్లాన్ చేశారు.