Sun. Jun 16th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మే 21,2024: తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగానికి చెందిన టాస్క్‌ఫోర్స్ బృందం శనివారం లక్డీకాపూల్ ప్రాంతంలోని తినుబండారాలను తనిఖీ చేసింది. అపరిశుభ్రతను గుర్తించి, లేబొరేటరీకి నమూనాలను పంపింది.

‘రాయలసీమ రుచులు’ లో 20 కిలోల నల్లపురుగులు పట్టిన మైదా, పురుగులున్నరెండు కిలోల చింతపండుతో పాటు, గడువు ముగిసిన అమూల్ పాలను గుర్తించారు.

తయారీ లైసెన్స్ లేని మొత్తం 168 గోలీ సోడా బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక, లేబుల్ లేని జీడిపప్పు, రూ.11,000 విలువైన రోటీ పిండి లభించాయి. అంతేకాకుండా, వంటగదిలో నిల్వ పద్ధతులు ,అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

షా ఘౌస్‌లో లేబుల్ లేని వస్తువులు కనుగొన్నారు. ఫుడ్ హ్యాండ్లర్ల మెడికల్ రికార్డులు కూడా అందుబాటులో లేవు. ఇక్కడ దొరికిన ఆహారపదార్థాలు రూల్స్ ప్రకారం లేవని వారు కనుగొన్నారు.

ఇదికూడా చదవండి:AI భయం : భవిష్యత్తులో ఫిషింగ్, మాల్వేర్‌లకు సంబంధించిన కేసులు పెరుగుతాయా?