Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జనవరి 24, 2024: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం తాత్కాలిక ప్రాతిపదికన (నెలకు గరిష్టంగా 6 రోజులు మాత్రమే) పని చేసేందుకు న్యూస్ ఎడిటర్‌లు (తెలుగు/ఇంగ్లీష్), న్యూస్ రీడర్‌లు (తెలుగు/ఉర్దూ) కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. న్యూస్ రీడర్‌లు ఆడిషన్ (వాయిస్ టెస్ట్)లో కూడా ఉత్తీర్ణత సాధించాలి.

ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం www.newsonair.gov.in వెబ్‌సైట్ లో vacancies పేజీలో చూడగలరు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలు చేరవలసిన ఆఖరు తేదీ: 31.01.2024.