365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ, ఏప్రిల్ 30,2025: అమెజాన్ కంపెనీ భారత మార్కెట్‌లో కొత్త Kindle పేపర్‌వైట్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు విడుదలైన అన్ని Kindle మోడళ్లలో ఇదే అత్యంత వేగవంతమైనది. 7 అంగుళాల పెద్ద డిస్‌ప్లే, సన్నని డిజైన్, ఒకే ఛార్జ్‌తో 12 వారాల పాటు బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వినియోగదారులు దీన్ని రూ.16,999కి అమెజాన్ వెబ్‌సైట్‌లో బ్లాక్ కలర్‌లో కొనుగోలు చేయొచ్చు.
ప్రదర్శనలో వేగం, డిజైన్‌లో నవీనత
అత్యాధునిక డ్యూయల్-కోర్ ప్రాసెసర్‌తో రూపొందించిన ఈ పరికరం, పేజీ టర్న్‌లలో 25 శాతం వేగం చూపిస్తుందని అమెజాన్ తెలిపింది. టచ్ రెస్పాన్స్ మెరుగ్గా ఉండటంతో వినియోగదారులు తమ లైబ్రరీలో సులభంగా నావిగేట్ చేయొచ్చు. USB-C ద్వారా ఛార్జింగ్ సౌలభ్యం లభిస్తుంది.
Also read this…Amazon Unveils the All-New Kindle Paperwhite in India — The Fastest and Most Advanced Yet
ఇది కూడా చదవండి…టాటా ఏఐజీ 3X వృద్ధి మెడికేర్ సెలెక్ట్ హెల్త్ పాలసీ ప్రారంభం..
డిస్‌ప్లేలో ఆధునికత
ఈ కొత్త మోడల్ 7 అంగుళాల వాటర్‌ప్రూఫ్ డిస్‌ప్లేతో వస్తోంది. సన్నని బోర్డర్లు, పెద్ద స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో పఠన అనుభూతిని మరింత మెరుగుపరుస్తుంది. 300 ppi గ్లేర్-ఫ్రీ డిస్‌ప్లే వల్ల ప్రకాశవంతమైన వెలుతురులోనూ స్పష్టంగా చదవవచ్చు. చీకటి మోడ్, సర్దుబాటు చేయగల కాంతి ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
పఠనాన్ని కేంద్రంగా చేసుకుని డిజైన్
Kindle పేపర్‌వైట్ అంతరాయం లేని చదువుకు అనుకూలంగా రూపొందించనుంది. ఎక్స్‌రే వంటి ఫీచర్లతో పుస్తకంలోని వ్యక్తులు, ప్రదేశాలపై సమాచారం తెలుసుకోవచ్చు. వర్డ్ వైజ్ ఫీచర్ కొత్త భాషలు నేర్చుకునే వారికి దోహదపడుతుంది.

భాషల విస్తరణ – పెద్ద ఈబుక్ స్టోర్
Amazon Kindle ద్వారా హిందీ, తమిళం, మరాఠీ భాషల్లో ఈబుక్స్ చదవొచ్చు. Kindle Unlimited సభ్యులకు 20 లక్షలకి పైగా ఈబుక్స్‌పై అపరిమిత యాక్సెస్ లభిస్తుంది. ప్రైమ్ మెంబర్లకు ఎంపికైన ఈబుక్స్ ఉచితంగా అందుబాటులో ఉంటాయి.
Also read this…TATA AIG Reports 3X Growth in Telugu States, Launches MediCare Select..
Also read this…Tata Elxsi Wins iF Design Award 2025 for Innovation in Gaming and Sports UX..
ధర, లభ్యత
Kindle పేపర్‌వైట్ ₹16,999కు Amazon.inలో బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉంది. కవర్‌లు బ్లాక్, మేరిన్ గ్రీన్, ట్యులిప్ పింక్ రంగుల్లో రూ.1,999కి లభ్యమవుతున్నాయి.