Sat. Apr 20th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 29,2024: పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ,రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అన్న సేవతో ప్రారంభమయ్యాయి.

జామ్‌నగర్‌లోని రిలయన్స్ టౌన్‌షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో రాధిక మర్చంట్‌తో సహా ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ, అంబానీ కుటుంబంలోని ఇతర సభ్యులు గుజరాతీ సంప్రదాయ ఆహారాన్ని గ్రామస్థులకు అందించారు.

రాధిక అమ్మమ్మ, తల్లిదండ్రులు వీరేన్, శైలా మర్చంట్ కూడా అన్న సేవలో పాల్గొన్నారు.

అనంత్ అంబానీ వెడ్డింగ్: అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ కార్యక్రమాలు ఆహార సేవతో ప్రారంభమయ్యాయి, 51 వేల మందికి విందు ఏర్పాట్లు చేశారు.

పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అన్న సేవతో ప్రారంభమయ్యాయి.

జామ్‌నగర్‌లోని రిలయన్స్ టౌన్‌షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో రాధిక మర్చంట్‌తో సహా ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ, అంబానీ కుటుంబంలోని ఇతర సభ్యులు గుజరాతీ సంప్రదాయ ఆహారాన్ని గ్రామస్థులకు అందించారు.

రాధిక అమ్మమ్మ, తల్లిదండ్రులు వీరేన్, శైలా మర్చంట్ కూడా అన్న సేవలో పాల్గొన్నారు. సుమారు 51 వేల మంది స్థానిక నివాసితులకు విందు ఏర్పాటుచేశారు. ఇది రాబోయే కొద్ది రోజుల పాటు కొనసాగుతుంది.

స్థానిక ప్రజల ఆశీర్వాదం కోసం ఆహార సేవ..

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహానికి ప్రీవెడ్డింగ్ వేడుకల కోసం స్థానిక ప్రజల ఆశీర్వాదం కోసం అంబానీ కుటుంబం అన్న సేవను నిర్వహించింది.

అంబానీ కుటుంబంలో భోజనానికి వచ్చిన ప్రజలకు భోజనం వడ్డించే సంప్రదాయం ఎప్పటినుంచో వస్తోంది. భోజనం అనంతరం హాజరైన వారు సంప్రదాయ జానపద సంగీతాన్ని ఆస్వాదించారు.

ప్రముఖ గుజరాతీ గాయకుడు కీర్తిదాన్ గాధ్వి తన గానంతో ఇక్కడికి వచ్చిన ప్రజలను అలరించారు.