Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,జనవరి 23,2024: ఆధ్యాత్మిక, భౌతిక ప్రపంచాలను అనుసంధానం చేసే అద్భుతమైన గ్రంథం ‘ఆంగిక రామచరిత మానస్’.

ఈ గ్రంథాన్ని గోస్వామి తులసీదాస్ రచించిన “రామచరిత్ మానస్”ను ఆధారంగా చేసుకుని రాశారు. భారతీయ సంస్కృతి, ఆచారాలు, నాగరికత గురించి అద్భుతంగా రచయిత్రి కుమారి రూప వర్ణించారు.

భక్తి, జ్ఞానం, కర్మల విశ్లేషణ రామచరిత మానస్‌లో ఉంటే, దానితో పాటు కొన్ని వివాదాస్పద అంశాలను స్పృశించి కచ్చితమైన అర్థాలను, వ్యక్తిగత ఆలోచనలకు జోడించి రచయిత్రి వ్యక్తం చేశారు.

అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా, బాలరాముని ప్రాణప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకుని రచయిత్రి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

పూజనీయమైన, ఆరాధనీయైమన, ప్రతి ఇంట్లో ఉండాల్సిన పుస్తకమంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.