Wed. Jan 15th, 2025

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 4,2024: వన్యప్రాణులు,ప్రకృతి కథలను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేయడానికి యానిమల్ ప్లానెట్ తన ప్రసారాలను తెలుగు భాషలో ప్రారంభించింది.

ఈ కొత్త వ్యూహంతో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని, వారి ఇంటికి చేరువ అయ్యేందుకు సిద్ధమైంది.

ప్రధాన కార్యక్రమాలలో ప్రైడ్ రూల్స్, ది హంగ్రీ గేమ్స్: అలాస్కాస్ బిగ్ బేర్ ఛాలెంజ్, ప్రాజెక్ట్ టైగర్ వంటి విశేషమైన కథనాలు ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్‌లు దట్టమైన అరణ్యాలు, పులులు, వేటాడే జంతువుల కథనాలతో ఉత్సాహభరితమైన అనుభవాన్ని అందిస్తాయి.

స్థానిక భాషలో ప్రసారం..
తెలుగు ప్రసారాలు డీటీహెచ్, కేబుల్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటాయి. ఇవి పూర్తిగా స్థానికంగా డబ్ చేసిన కంటెంట్‌ను కలిగి ఉంటాయి. తెలుగు మాట్లాడే ప్రాంతానికి చెందిన వాయిస్ ఆర్టిస్టులు,రైటర్ల నెట్‌వర్క్ ద్వారా ప్రామాణికతను నిర్ధారించారు.

వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ..
ఫ్యాక్చువల్,లైఫ్‌స్టైల్ క్లస్టర్ హెడ్ సాయి అభిషేక్ మాట్లాడుతూ, “తెలుగు ప్రసారాలతో గ్లోబల్ కథనాలను స్థానిక రుచులకు అనుగుణంగా రూపొందించడం ద్వారా, ఈ ప్రాంత ప్రేక్షకులకు ఆకర్షణీయమైన అనుభవాన్ని అందించగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. వన్యప్రాణుల ప్రపంచం నుంచి ఇప్పటివరకు వినని కథల్ని, మరింత చేరువ చేసేందుకు ఇది గొప్ప అవకాశం,” అన్నారు.

తెలుగు ప్రసారాలు యానిమల్ ప్లానెట్ వ్యూహంలో ప్రధానమైన భాగంగా ఉంటాయి. దక్షిణ భారతదేశంలో వన్యప్రాణుల కంటెంట్‌కు ఉన్న ప్రత్యేకమైన అనుబంధం కారణంగా, ఈ ప్రాంతంలో ఛానెల్ మరింత అభివృద్ధిని సాధించేందుకు అవకాశాలు ఉన్నాయి.

తెలుగు ప్రేక్షకులకు వీక్షణానందాన్ని మరింత చేరువ చేసే యానిమల్ ప్లానెట్ ఈ ప్రయత్నం ద్వారా, తమ ప్రసారాలను విస్తరించి, ప్రపంచస్థాయి కథనాలను తెలుగు భాషలో అందించడం ద్వారా స్థానిక కంటెంట్ పట్ల తమ నిబద్ధతను మరోసారి నిరూపించుకుంది.

error: Content is protected !!