Sat. Jul 27th, 2024

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 31,2023: అత్తాపూర్ లోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ తన వార్షిక క్రీడా దినోత్సవాన్ని విజయ వంతంగా పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

విద్యార్థి మండలి సభ్యులు గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ ద్వారా అతిథులకు ఘనస్వాగతం పలికి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి మాజీ జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు, క్రికెట్ అండ్ ఫిట్నెస్ నేషనల్ అకాడెమీ వ్యవస్థాపకుడు కిరణ్ రెడ్డి, అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ డా.సి.హెచ్. శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

విద్యార్థులు బ్రెజిల్ డ్యాన్స్, కరాటే, బటర్‌ఫ్లై రేస్, డంబ్ బెల్ డ్రిల్, మషాల్ రన్, పార్టనర్ అప్ రిలే ,మరెన్నో ప్రదర్శనల ద్వారా తమ నైపుణ్యాలను స్ఫూర్తిని ప్రదర్శించారు.

ప్రిన్సిపాల్ శ్రీమతి అన్నపూర్ణ కోడూరు, డైరెక్టర్ శ్రీమతి అనురాధ సూరపరాజు వార్షిక నివేదికను అందించారు. అలాగే రాష్ట్ర, జాతీయ స్థాయిలో విద్యార్థులు,పాఠశాల సాధించిన అనేక అవార్డుల గురించి తెలియజేస్తూ తల్లిదండ్రులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

పాఠశాల డైరెక్టర్లు నారాయణ మూర్తి FCA హైకోర్టు న్యాయవాది SVS కిషోర్ కుమార్ పాల్గొన్నారు. వారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని ఆరోగ్యంగా ఉండటానికి కనీసం ఒక క్రీడను తమ అభిరుచిగా కలిగి ఉండాలని విద్యార్థులను ప్రోత్సహించారు.

ముఖ్య అతిథి డాక్టర్ సీహెచ్. శ్రీనివాసరావు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, విద్యార్థులు తమ లక్ష్యాలను ఎప్పటికీ వదులుకోవద్దని, విద్య ,క్రీడలు రెండింటినీ సమతూకం చేస్తూ తమ అత్యుత్తమ సామర్థ్యాలతో వాటిని సాధించేందుకు ప్రయత్నించాలని చైతన్యపరిచారు.

గౌరవ అతిథి మాజీ నేషనల్ వాలీ బాల్ ప్లేయర్, క్రికెట్ అండ్ ఫిట్‌నెస్ అకాడమీ వ్యవస్థాపకుడు అయిన కిరణ్ రెడ్డి జాతీయ వాలీబాల్ ప్లేయర్ నుంచి క్రికెట్ అండ్ ఫిట్‌నెస్ అకాడమీ వ్యవస్థాపకుడిగా తన ప్రయాణాన్ని పంచుకుంటూ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ ఈవెంట్ సమిష్టి కృషికి నిదర్శనం అని స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడారు. అందులో పాల్గొన్న ఉపాధ్యాయులకు, వాలంటీర్లకు, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.