Tue. Apr 30th, 2024
Anu-Music-Cultural-Academy

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ,ఆగస్టు 28,2022 :”అను మ్యూజిక్ కల్చరల్ అకాడమీ” సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బంజారాహిల్స్ లోని కళింగా కల్చరల్ సెంటర్ లో పాటల పోటీలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు ఆంధ్రప్రదేశ్ స్కూల్ రెగ్యులేటరీ వైస్ చైర్మన్ డాక్టర్ అరిమండ విజయ శారద రెడ్డి, ఏపీ ఆర్టీఐ మాజీ కమిషనర్ డా. ముత్తంశెట్టి విజయ నిర్మల, టీవీ యాంకర్ ప్రముఖ నటి ఝాన్సీ, టెలివిజన్ ,ఫిల్మ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శంకర్, ఇండియన్ ఐడల్ ఫేమ్ సింగర్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.

నేర్పు నేర్పించు జీవించు అనే నినాదంతో ” అను మ్యూజిక్ కల్చరల్ అకాడమీ “తన సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తోందని, అందులోభాగంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు ” అను మ్యూజిక్ కల్చరల్ అకాడమీ ఫిలిం నగర్” సంస్థ వ్యవస్థాపకురాలు పూర్ణిమ తెలిపారు.

Anu-Music-Cultural-Academy

మాటలు ఎన్ని విన్నాఆ సందేశం పాట ద్వారా అయితే లోపల నర నరాల్లోకి చేరి మనిషిని ఆకర్షించి ఆలోజింప జేసే గొప్ప శక్తి ఒక్క సంగీతానికి మాత్రమే ఉందని ఆమె పేర్కొన్నారు.

” అను మ్యూజిక్ కల్చరల్ అకాడమీ ఫిలిం నగర్” సంస్థ 25 సంవత్సరాల సంగీత ప్రయాణం లో ఎంతోమంది మానసిక రుగ్మతలు ,సైడ్ ఎఫెక్ట్స్ , డిప్రెషన్స్ ,మతి మరుపు ,నత్తి ఇలా ఎన్నో క్యూర్ అయ్యాయని సంస్థ నిర్వాహకులు తెలిపారు.

ఇంత విలువైన విద్య పేద విద్యార్థులకు కూడా అందించాలనే ఆలోచనతో ప్రతి నెలా గవర్నమేంట్ స్కూల్ ,కాలేజీలలో భక్తి , దేశ భక్తి తో కూడిన పాటలు అర్ధాన్ని వివరిస్తూ నేర్పిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ ఏ వృత్తి లో , ఏ స్థితిలో ఉన్న .. సంగీతంతో సహవాసం చేస్తుంటే …సుగంధ పుష్పానికి .. గడ్డి పువ్వుకి గల తేడా తెలుస్తుంది. పరిపూర్ణత్వాన్ని పొందుతారని చెప్పడానికి గర్విస్తున్నామని సంస్థ నిర్వాహకులు పూర్ణిమ తెలిపారు.