Sat. Jul 13th, 2024

365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, మార్చి24 ap: రాష్ట్ర స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 7 ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాశీ కృష్ణ శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం కరోనా వైరస్ నివారణపై అధికారులతో సమీక్షా సమావేశం అనంతరం ఉడా చిల్ట్రన్ ఎరీనాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి విదేశాల నుండి వచ్చిన వారు 14,038 మంది ఉన్నారన్నారు. 28 రోజులు పరిశీలనలో ఉన్నవారు 11,526 మంది ఉన్నారని చెప్పారు. అనుమానిత కేసులు 220 మంది కాగా ఇందులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 7 ఉన్నాయని పేర్కొన్నారు. నెగిటివ్ 168 మంది ఉన్నారని, రిపోర్టులు రావలసినవి 45 మంది ఉన్నట్లు ఆయన వివరించారు. కరోనా నివారణకు ప్రభుత్వం అన్నిరకాలలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. విశాఖపట్నంలో 3 పాజిటివ్ కేసులు ఉన్నాయని చెప్పారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని తెలిపారు. లాడ్ డౌన్ పటిష్టంగా అమలు చేయడానికి విశాఖ జిల్లా ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. వైద్య ఆరోగ్య శాఖాధికారులు, ఇతర శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రజలంతా సామాజిక బాధ్యతగా సామాజిక దూరాన్ని ప్రతీ ఒకరు పాటించాలని చెప్పారు. ప్రతీ ఒక్కరూ ఇంటికే పరిమితం కావలని స్పష్టం చేశారు. లాక్ డౌన్ ప్రకటించక ముందే విద్యా సంస్థలు బంద్ చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి ముందు జాగ్రత చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. 10వ తరగతి పరీక్షలు ప్రభుత్వం వాయిదా వేసినట్లు చెప్పారు. ప్రక్కరాష్ట్రాలు లాక్ డౌన్ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమణించి వారి బాధ్యతను నిర్వహించాలన్నారు. జిల్లా ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. విశాఖపట్నంలోని ఐసోలేషన్ వార్డులు విమ్స్ లో 200 పడకలు, కెజిహెచ్ లో 200 పడకలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అందుకు కావలసిన వసతులు ముఖ్యమంత్రితో మాట్లాడి ఏర్పాటు చేస్తామన్నారు. కరోనా వైరస్ రెండవ దశలో బందువులకు, స్నేహితులకు చేరుతుందని, మూడవ దశలో ప్రలకు వ్యాప్తి చెందడం జరుగుతుందని తెలిపారు. విశాఖ జిల్లా ప్రజలు అప్రమత్తతతో ఉండాలని, కరోనా వైరస్ నివారణకు కఠినమైన నిర్ణయాలకు ప్రభుత్వం వెనుకాడదని ఆయన స్పష్టం చేశారు. లాక్ డౌన్ సమయంలో రోజు వారీ కూలీలను, పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి నెలకు రేషన్, కందిపప్పు, ఖర్చుకు రూ.1000/-లు పంపిణీ చేయనున్నట్లు ఆయన వివరించారు. జిల్లాలో కరోనా వైరస్ నివారణకు ప్రణాళికా బద్దంగా ప్రభుత్వ ఆదేశాలను జిల్లాలో ఏర్పాటుచేసిన 20 కమిటీలు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నట్లున ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన జాబితా ప్రకారం విదేశాల నుండి వచ్చిన వారు 1470 మంది కాగా వారు హోం క్వారంటైన్ లో ఉన్నారని, మరో 2400 మంది జాబితా వచ్చిందని వారిని ఈ రోజు సాయంత్రం నాటికి గుర్తించడం జరుతుందన్నారు. హోం క్వారంటైన్ లో ఉన్న వారు జిల్లా యంత్రాంగానికి ఎవరైనా సహకరించకపోతే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. విదేశాల నుండి వచ్చిన వారు ఎవరైనా హోం క్వారంటైన్ పాటించకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. గ్రామాల్లోకి విదేశాల నుండి వచ్చిన ప్రతీ 10 మందికి ప్రతీ పంచాయితీకి ప్రత్యేక అధికారి ఉంటారని తెలిపారు.

లాక్ డౌన్ ను తీవ్రంగా పరిగనించాలి ; మంత్రి కురసాల కన్నబాబు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ విశాఖపట్నంలో 3 పాజిటివ్ కేసులు ఉన్నాయని, కరోనా నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు సంతృప్తికంగా ఉన్నాయన్నారు. జిల్లాలో మాస్క్ లు కొరతగా ఉన్నాయని, విశాఖపట్నంలో అవసరం లేకపోయినా ప్రజలు రోడ్లపైకి వస్తున్నట్లు చెప్పారు. లాక్ డౌన్ ను తీవ్రంగా పరిగనించాలని నగర పోలీసు కమీషనర్ కు సూచించారు. ఫార్మా కంపెనీలు, కనీస ఉద్యోగులుతో పనిచేయించుకోవాలని, ఆయిల్ కంపెనీలు, పోర్టులు ఎంత మంది సిబ్బంది అవసరవెూ అంత మందిని వినియోగించుకోవాలన్నారు. సామాజిక దూరం పాటించాలని, ఇరుకుగా ఉన్న రైతు బజార్లు స్కూల్ మైదానలలోకి మార్చాలని చెప్పారు.