APIS India adds Natural Immunity booster -Apple Cider Vinegar in Its Portfolio APIS India adds Natural Immunity booster -Apple Cider Vinegar in Its Portfolio

365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 12,2021: మహమ్మారి వేళ, ఆరోగ్యం ,సంక్షేమం గురించిన సంభాషణ రాగానే సహజసిద్ధమైన రోగ నిరోధక శక్తి మెరుగుపరుచుకోవడంపై ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఇటీవలి నివేదికలు వెల్లడించే దాని ప్రకారం, మహమ్మారి ఆరంభమైన తరువాత సంప్రదాయ రోగ నిరోధకశక్తి పెంపొందించే అంశాల పట్ల ఆసక్తి పెరిగింది. అది ఇప్పుడు కూడా కొనసాగుతుంది. వినియోగదారుల అవసరాలపై దృష్టి సారించి, భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్‌లలో ఒకటైన అపిస్‌ ఇండియా ఇప్పుడు ముడి , ఫిల్టర్‌ చేయనటువంటి యాపిల్‌ సిడర్‌ వినిగర్‌ను ఆవిష్కరించింది. 500 గ్రాముల బాటిల్‌ ధర 349 రూపాయలు. దేశవ్యాప్తంగా రిటైల్‌ స్టోర్లతో పాటుగా ఫ్లిప్‌కార్ట్‌ సూపర్‌మార్ట్‌ వద్ద కూడా ఇది లభ్యమవుతుంది.

APIS India adds Natural Immunity booster -Apple Cider Vinegar in Its Portfolio
APIS India adds Natural Immunity booster -Apple Cider Vinegar in Its Portfolio

అపిస్‌ ఇండియా సీఈవో పంకజ్‌ మిశ్రా మాట్లాడుతూ ‘‘నేడు, వినియోగదారులు సహజసిద్ధంగా రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడం మరియు నివారణ ఆరోగ్య సంరక్షణ ఆవశ్యకతను గుర్తిస్తున్నారు. అత్యధిక పోషకాలు కలిగిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. వాటిలో యాపిల్‌ సిడర్‌ వినిగర్‌ ఒకటి. ఆరోగ్య పరంగా ఇది అందించే ప్రయోజనాలను ఇప్పుడు అధికశాతం మంది గుర్తిస్తున్నారు’’ అని అన్నారు. అపిల్‌ యాపిల్‌ సిడర్‌ వినిగర్‌ను అసలైన హిమాలయన్‌ యాపిల్స్‌తో తయారుచేశారు. ఈ ఆవిష్కరణతో కంపెనీ ఇప్పుడు తమ కీలకమైన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో నిర్మించుకోవడంతో పాటుగా ఆరోగ్య విభాగంపై కూడా దృష్టి సారించింది.