365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 5thసెప్టెంబర్ 2020 : అపోలో హాస్పిటల్స్‌కు చెందిన వైద్య బృందం,ఆరోగ్యపరంగా అత్యంత క్లిష్టపరిస్థితికి చేరుకున్న తల్లి,బిడ్డను కాపాడడం ద్వారా ఒక అద్బుతాన్ని ఆవిష్కరించారు. 7 నెలల గర్బిణీ కోవిడ్ మహమ్మారికి గురై వెంటిలేటర్‌పై చికిత్సను పొందుతుండగా, ఆమె చావుబతుకుల పరిస్థితిలో ఉన్నా కడుపులో ఉన్న బిడ్డను కాపాడేందుకు వైద్య బృందం ఆమెకు ముందస్తు డెలివరీని నిర్వహించారు. సంతాన సాఫల్య చికిత్సను అందుకుని కోవిడ్‌తో వెంటిలేటర్‌పై చికిత్స అందుకుంటున్న గర్బిణీకి డెలివరీ చేసి ఆమె గర్బంలో 7 నెలలు కూడా నిండని నవజాత శిశువును డెలివరీ చేయడం ఇదే మొదటిసారి.ఏడు సంవత్సరాల క్రితం వివాహం అయిన 34 ఏళ్ల మంజుల, సంతానం కలగకపోవడంతో సంతాన సాఫల్య చికిత్సను అందుకుని గర్బం దాల్చి ఏడవ నెలతో ఉన్నారు. ఈ దంపతులకు ఇదెంతో విలువైన డెలివరీ కావడం,బిడ్డ కోసం వారు ఎంతో ఆరాటపడడంతో తదుపరి వైద్యపరంగా ఎదురయ్యే సమస్యలను నివారించేందుకు అపోలో హాస్పిటల్‌కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ డా॥ షర్మిలను సంప్రదించారు. అయితే ఇతర కుటుంబ సభ్యులతోపాటు గర్బిణీ కూడా కోవిడ్ బారిన పడడంతో, జూలై 15న ఆమె ఆరోగ్యం విషమ పరిస్థితికి చేరుకుంది.హాస్పిటల్‌లో చేర్చుకున్న సమయానికి గర్బిణీ ఆరోగ్య పరిస్థితి వేగంగా క్షీణించడం మొదలుపెట్టింది, ఆక్సిజన్ సంతృప్తస్థాయి చాలా తక్కువగా ఉండడంతో ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్సను అందించాల్సి వచ్చింది. వైద్యపరంగా చూస్తే ఆమె మనుగడపై ఆశలు వదులుకోవడం జరిగింది, ఎందుకంటే ఇంకా ప్రీటెర్మ్ బేబిని డెలివరీ చేయాల్సి ఉన్న లేదా వెంటిలేషన్ అవసరమైన 90% మంది గర్బిణీలు చనిపోయే ఆస్కారం ఉన్నది.
ఈ కేసులో వైద్య బృందం ఎదుర్కున్న సవాళ్లు :
1. గర్బం కారణంగా అధిక రక్తస్రావం, తీవ్రమైన వైరల్ లోడ్ ఉన్న కోవిడ్ ఇన్‌ఫెక్షన్ కారణంగా వైద్య బృందం కూడా వైరస్‌కు గురయ్యే ప్రమాదం
2. వెంటిలేషన్‌లో ఇబ్బందులు , కోవిడ్ రోగులకు అవసరమైన పొట్టపై బోర్లాగా పదుకోవాల్సిన భంగిమ ఆమెకు చేతకకపోవదం, గర్బిణీ కాని వారు అయితే అలా పడుకోగలుగుతారు
3. పిపిఇ కిట్లు ధరించి శస్త్రచికిత్స చేయడంలో ఇబ్బందులు
4. జనన సమయంలో శిశువు ఎపిగార్‌ను అంచనావేయడంలో,పునరుద్దరించడంలో పిపిఇ వలన సరైన అంచనా వేయలేకపోవడం.
వైద్య బృందం సవాలును స్వీకరించింది తల్లి, బిడ్డను కాపాడేందుకు వారు కృత నిశ్చయాన్ని తీసుకున్నారు. ప్రాథాన్యత పరంగా మొదట తల్లిని రక్షించానుకున్నారు. చికిత్స అందిస్తున్న సమయంలో తల్లి స్పందించడం మానేసింది, ఆమె బతికే అవకాశాలు సన్నగిల్లాయి. తల్లి చనిపోతే కనీసం బిడ్డను అయినా రక్షించాలని వైద్య బృందం నిర్ణయించుకుంది. జూలై 17న వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు తల్లికి ఆపరేషన్ చేసి శిశువును బయటికి తీశారు. మందులతో శిశువు గుండె పనితీరును పునరుద్దరించారు అయితే ఆ శిశువు మనుగడ సాగించడం చాలా కష్టమనిపించింది. ఆ తరువాత శిశువుకు బ్లడ్ స్ట్రీమ్ ఇన్‌ఫెక్షన్ రాగా చికిత్సను అందించారు. శిశువు క్రమంగా పుంజుకోవడం జరిగింది, పాప చికిత్సకు బాగా స్పందించి రోజు రోజుకూ మెరుగ్గా కోలుకున్నది. బాగా కోలుకున్న పాపను ఈ రోజున డిశ్చార్జు చేశారు. ఈ లోపల, తల్లి కూడా పూర్తిగా కోలుకోగా ఆగష్టు 10న ఆమెను కూడా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు.క్రిటికల్ కేర్ నుండి డా॥ దీపక్, డా॥ నాగరాజు , డా॥ సిద్దార్ద్,ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ నుండి డా॥ సునీత , ఆమె బృందం,గైనకాజీస్ట్ డా॥ విమీబింద్రా,అనెస్థీషియన్ డా॥ సనత్ రెడ్డి,నియోనాటల్‌కు చెందిన డా॥ షర్మిల పల్మనాలజిస్ట్ డా॥ చంద్రకాంత్,రేడియోలజీకి చెందిన డా॥ ప్రసాద్‌తో కూడిన వైద్య బృందం ఈ ఘనతను సాధించింది. ఈ సందర్బంగా క్రిటికల్ కేర్‌కు చెందిన వైద్యులలో ఒకరు కోవిడ్ మహమ్మారి బారిన పడ్డారు దానితో అనేక అడ్డంకులను అధిగమించి ఈ అద్బుతం జరిగేందుకు మొత్తం బృందం తమ ప్రాణాలనే పణంగా పెట్టింది.