Fri. Dec 13th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అక్టోబర్ 17,2023: నైట్ టైమ్ బ్రష్ చేయకుండా నిద్రపోతున్నారా..? ఈ విషయం తెలిస్తే ఇకనుంచి తప్పకుండా నైట్ పళ్లు తోముకొని నిద్ర పోతారు మరి..రాత్రిపూట దంతాలను శుభ్రం చేసుకోని వారి గురించి ఓ రీసెర్చ్ చేశారు. ఇందులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

రాత్రిపూట బ్రష్ చేసిన తర్వాత నిద్రపోని వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనం స్పష్టంగా పేర్కొంది. నేచర్ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం, రాత్రి బ్రష్ చేయకపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని తేలింది. ఈ అధ్యయనంలో 20 సంవత్సరాలు , అంతకంటే ఎక్కువ వయస్సు గల 1675 మంది పాల్గొన్నారు.

రాత్రిపూట బ్రష్ చేయని వ్యక్తులకు హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రతిరోజూ బ్రషింగ్ , ఫ్లాసింగ్ చేయడం వలన పీరియాంటల్ డిసీజ్, దంత క్షయం ,నోటి పరిశుభ్రతకు సంబంధించిన సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఈ రీసెర్చ్ తేల్చింది.

మీరు నోటి పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించకపోతే, మీరు గుండె జబ్బులతో పాటు అనేక ఇతర వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది. నేచర్ జర్నల్ శాస్త్రీయ నివేదిక ప్రకారం, ఈ అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తులు శస్త్రచికిత్స, పరీక్షల కోసం 2013, 2016 మధ్య జపాన్‌లో ఉన్న ఒసాకా యూనివర్శిటీ హాస్పిటల్‌లో చేరారు.

మార్నింగ్ గ్రూప్ లో రోజుకు రెండుసార్లు ఉదయం,రాత్రి బ్రష్ చేసే 409 మంది వ్యక్తులు ఉన్నారు. నైట్‌ గ్రూప్ లో 751 మంది ఉన్నారు. వారు రాత్రిపూట మాత్రమే బ్రష్ చేశారు.

ఉదయం పూట నిద్రలేచిన తర్వాత పళ్లు తోముకునే మార్నింగ్ టీమ్ లో 164 మంది ఉన్నారు. ఉదయం లేదా రాత్రి పళ్ళు తోముకోని వాళ్ల టీమ్ కూడా ఉంది.

‘అమెరికన్ డెంటల్ అసోసియేషన్’ రోజుకు రెండుసార్లు ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేయాలని సిఫార్సు చేస్తోంది. ఇది కాకుండా, రోజుకు ఒక్కసారైనా ఫ్లాసింగ్ చేయడం వల్ల నోటిలో పేరుకుపోయిన బ్యాక్టీరియాని తొలగించడంలో సహాయపడుతుంది.

error: Content is protected !!