Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై, ఏప్రిల్ 2,2024: ఏషియా సొసైటీ ఇండియా సెంటర్ బోర్డు తమ బోర్డు కొత్త చెయిర్‌గా సంగీతా జిందాల్ ఎన్నికైనట్లు ప్రకటించింది. ఆమె ఎన్నిక 2024 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.

“ఏషియా సొసైటీ ఇండియా సెంటర్ బోర్డు చెయిర్‌గా సంగీత జిందాల్‌ ఎన్నికవడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. దక్షిణాసియాలో మా కృషికి ఆమె ఎనలేని తోడ్పాటు అందిస్తున్నారు.

అలాగే భారతదేశంలో దక్షిణాసియాలో సమకాలీన ఆర్ట్‌కు ఆమె ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నారు” అని ఏషియా సొసైటీ ఇండియా సెంటర్ సీఈవో ఐనాక్షి సోబ్తి (Inakshi Sobti) తెలిపారు.

ఆర్ట్ ఇండియాకి ప్రెసిడెంటుగా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన సామాజిక అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేసే జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా సంగీతా జిందాల్ వ్యవహరిస్తున్నారు.

గడిచిన ఇరవై ఏళ్లుగా ఆమె జేఎస్‌డబ్లయూ ఫౌండేషన్‌కి సారథ్యం వహిస్తున్నారు. ఆమె నేతృత్వంలో ఫౌండేషన్ కార్యకలాపాలు విద్య, ఆరోగ్యం, జీవనోపాధి కల్పన, స్థానిక క్రీడల అభివృద్ధి, కళలు, సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణ మొదలైన వాటికి కూడా విస్తరించింది.

ఆమె 1992లో జిందాల్ ఆర్ట్స్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. భారతదేశ ప్రీమియర్ ఆర్ట్ మ్యాగజైన్ ఆర్ట్ ఇండియాను 1994లో నెలకొల్పారు.

ఏషియా సొసైటీని 1956లో మూడో జాన్ డి. రాక్‌ఫెల్లర్ నెలకొల్పారు. ఇది నిష్పాక్షికమైన, లాభాపేక్షరహితమైన సంస్థ. న్యూయార్క్, హ్యూస్టన్, హాంకాంగ్ వంటి ప్రధాన నగారాలు కేంద్రంగా పని చేస్తోంది.

లాస్ ఏంజెలిస్, మనీలా, ముంబై, సియాటిల్, సిడ్నీ తదితర ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఇండియా సెంటర్ 2006లో ఏర్పాటైంది. దక్షిణాదిలో ఇది ఏకైక ఏషియా సొసైటీ సెంటర్. ఏషియా సొసైటీ ఇండియా గురించి మరింత తెలుసుకునేందుకు asiasociety.org/india ను సందర్శించండి.

ఇది కూడా చదవండి33 శాతం పెరిగిన ఆడి కార్ల విక్రయాలు..

ఇది కూడా చదవండి :ఈ ఫీచర్ ను ఆపేసిన గూగుల్..

Also read : Reliance Jio Leads India’s 5G Revolution with Swift Deployment and Superior Performance: Ookla Report..

ఇది కూడా చదవండి: ‘నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ పాలసీ 2024’ రూపొందించేందుకు సిద్ధమైన TRAI..