365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 6, 2025: దేశంలో ప్రముఖ లగ్జరీ ఉపరితల ఉత్పత్తుల కంపెనీ ఏషియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్ (AGL) హైదరాబాద్‌లో తన మెగా డిస్‌ప్లే షోరూమ్‌ను ప్రారంభించింది. టైల్స్, మార్బుల్స్, క్వార్ట్జ్, బాత్‌వేర్ పరిష్కారాల్లో ఏజీఎల్ సమృద్ధి గల వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందిన ఈ సెంటర్, వినియోగదారులకు విభిన్నమైన అనుభూతిని అందించనుంది.
3,500 చ.అ. విస్తీర్ణంలో లగ్జరీ డిస్‌ప్లే సెంటర్ హైదరాబాద్‌లో ఏజీఎల్‌కు ఇది అతిపెద్ద డిస్‌ప్లే షోరూమ్‌లలో ఒకటి. ఈ సెంటర్ 202 & 302, కుర్వే ఎలైట్, 3వ అంతస్తు, 8-3-833/58 & 47, ప్లాట్ నెం.58, ఫేజ్ -1, కమలాపురి కాలనీ మెయిన్ రోడ్, క్రిషే మెడోస్, హైదరాబాద్-5000 వద్ద ప్రారంభమైంది.
ఇది కూడా చదవండి…మహిళా కరస్పాండెంట్లను సత్కరించిన ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్
Read this also…Airtel Payments Bank Honors Women BCs on International Women’s Day
ఈ ప్రదర్శన కేంద్రం ఇండోర్ & అవుట్‌డోర్ డిజైనింగ్‌పై దృష్టిపెట్టి, ఆధునిక పోకడలకు అనుగుణంగా రూపొందించబడింది. ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్లు, గృహనిర్మాణ రంగ నిపుణులకు ఇది వన్-స్టాప్ డెస్టినేషన్.

AGL ప్రత్యేక సేకరణలు:
🔹 అలవారో
🔹 స్టోన్ ఎరా
🔹 టెరాక్
🔹 ప్రెస్టో
🔹 మార్బుల్‌ఎక్స్
🔹 గ్రెస్టెక్
🔹 గ్రాండురా
🔹 స్టైల్ఎక్స్
🔹 హార్డ్‌స్టోన్
🔹 ఫ్రెస్కో తదితర విభాగాల ద్వారా వినియోగదారులకు విభిన్నమైన ఎంపికలు అందుబాటులో ఉంటాయి.
ఈ సందర్భంగా ఏషియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కమలేష్ పటేల్ మాట్లాడుతూ, “సృజనాత్మకత, నాణ్యత, అడాప్టబిలిటీ కోసం ప్రసిద్ధి చెందిన AGL, గ్లోబల్ గుర్తింపును సంపాదించుకుంది.
ఇది కూడా చదవండి…చెరువుల అభివృద్ధికి ప్రాధాన్యత – సమగ్ర చర్యలు చేపడుతున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
Read this also…‘Rewind’ Stars Sai Ronak & Amrutha Chowdary Share Their Journey in This Thrilling Sci-Fi Romance
ఈ కొత్త షోరూమ్ ప్రేమియం డిజైన్స్, ఆధునిక శైలులు,అత్యుత్తమ విజువల్స్‌తో టైల్ షాపింగ్ అనుభూతిని పూర్తిగా మార్చివేస్తుంది. ఇది ఆర్కిటెక్ట్స్, డిజైనర్లు, వాణిజ్య భాగస్వాములకు ఒకే చోట అన్ని విభాగాల లగ్జరీ ఉత్పత్తులను అందించే వేదికగా మారనుంది” అని తెలిపారు.

ప్రపంచ స్థాయిలో ప్రాముఖ్యతను చాటుకున్న ఏషియన్ గ్రానిటో, హైదరాబాద్‌లో తన నూతన షోరూమ్ ద్వారా వినియోగదారులకు మరింత విలాసవంతమైన & నూతన శ్రేణి డిజైన్లను అందించేందుకు సిద్ధమైంది.