365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విజయవాడ, జూన్ 11 ,2025:నేచురల్ స్టార్ నానీని బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించిన తరువాత, ఐటీసీ ఆశీర్వాద్ మసాలాలు వినూత్న డిజిటల్ ప్రచారంతో ముందుకొచ్చాయి. వినియోగదారులకు సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తూ, కేవలం సెల్ఫీ ఆధారంగా వారి స్వంత మూవీ పోస్టర్‌ను నానీతో కలసి తయారు చేసుకునే అవకాశాన్ని కల్పించాయి.
ఈ ప్రత్యేకమైన ఎఐ (AI) ఆధారిత ప్రచారం వాట్సాప్ బాట్ ద్వారా నడుస్తోంది. ఇందులో భాగంగా అభిమానులు తమ ఫోటోను అప్లోడ్ చేసి, ఎమోషనల్, యాక్షన్, కామెడీ, థ్రిల్లర్ తరహాలో ప్రత్యేకమైన పోస్టర్‌ను రూపొందించుకోవచ్చు.
ఇది కూడా చదవండి..హైడ్రా ఆధ్వర్యంలో రంగంలోకి దిగుతున్న మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్..
ఇది కూడా చదవండి..‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ – ఉపాసనా కామినేని ప్రారంభించిన ఫ్యూజిఫిల్మ్ ఇండియా అవగాహన కార్యక్రమం
‘‘దమ్ము మీదే, స్టార్ మీరే’’ అనే థీమ్‌పై ఈ ప్రచారాన్ని రూపొందించారు. రోజువారీ వంటకాల్లో రుచి తీసుకొచ్చే గృహిణిని కిచెన్ స్టార్‌గా నిలిపే ఈ ప్రచారం, ఇప్పుడు ప్రతి ఒక్కరిని స్క్రీన్‌పై నానీతోపాటు నటించే రీల్ స్టార్లుగా మార్చేందుకు సిద్ధమైంది.

ఈ ఇంటరాక్టివ్ డిజిటల్ అనుభవంలో భాగంగా పాల్గొనాలంటే:
- ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ ప్యాక్ వెనుకనున్న QR కోడ్‌ను స్కాన్ చేయాలి
- లేదా ఆశీర్వాద్ మసాలా తెలుగు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోని లింక్‌ను క్లిక్ చేయాలి
- బాట్లోకి వెళ్లిన తరువాత, భాషను, స్టైల్‌ను, క్యారెక్టర్స్‌ను ఎంచుకుని సెల్ఫీని అప్లోడ్ చేయాలి
ఎంపికైన విజేతలకు నానీతో కలిసి బిల్‌బోర్డ్స్ మీద కనిపించే అవకాశం, అలాగే మూవీ టికెట్లు గెలుచుకునే అవకాశమూ లభిస్తుంది.
Read This also…FUJIFILM India Launches Nationwide Breast Cancer Awareness Campaign with Upasana Kamineni Konidela as Ambassador
Read This also…Volkswagen Virtus Celebrates Three Successful Years as India’s Leading Premium Sedan
తెలుగు ప్రజలలో సినిమాల పట్ల ఉన్న ఆసక్తిని, రుచి భరితమైన ఆహారంతో మేళవిస్తూ, ఆశీర్వాద్ మసాలాలు వినూత్నంగా వినియోగదారుల మనసు గెలుచుకుంటున్నాయి. కేవలం సెల్ఫీతో, కొన్ని ట్యాప్‌లతో తమకే చెందిన బ్లాక్‌బస్టర్ క్షణాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించవచ్చని సంస్థ ప్రకటించింది.
ఈ ప్రచారంలో పాల్గొని ‘‘మీ దమ్ము చూపించండి, మీ కథలో మీరు స్టార్‌గా మారండి’’ అని ఆశీర్వాద్ మసాలాలు ప్రజలను ఆహ్వానిస్తున్నాయి.