Thu. May 2nd, 2024
Ather Energy begins retail operations in Visakhapatnam
Ather Energy begins retail operations in Visakhapatnam
Ather Energy begins retail operations in Visakhapatnam

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, విశాఖపట్నం, జూలై 10,2021:భారతదేశంలో మొట్టమొదటి తెలివైన విద్యుత్‌ స్కూటర్‌ తయారీదారు,ఎథర్‌ ఎనర్జీ నేడు తమ నూతన వాణిజ్య కేంద్రం-ఎథర్‌ స్పేస్‌ ను న్యూ కాలనీ రోడ్‌,సుబ్బలక్ష్మి నగర్‌,విశాఖపట్నం వద్ద ఎస్‌ఎన్‌ ఆటో సహకారంతో ప్రారంభించింది. భారతదేశంలో అత్యంత వేగవంతమైన, స్మార్టెస్ట్‌ స్కూటర్‌ ఎథర్‌ 450ఎక్స్‌తో పాటుగా ఎథర్‌ 450 ప్లస్‌ వాహనాలు నూతనంగా ప్రారంభించిన ఎథర్‌ స్పేస్‌ వద్ద టెస్ట్‌ రైడ్‌, కొనుగోలు కోసం లభ్యమవుతాయి. వినూత్నమైన యాజమాన్య అనుభవాలతో పాటుగా సంపూర్ణమైన సేవల మద్దతునూ వాహన యజమానులకు అందించేందుకు ఎథర్‌ స్పేస్‌ సిద్ధమైంది. శక్తివంతమైన, స్శర్శ అనుభవాలను అందించే రీతిలో, ప్రభావశీలంగా తీర్చిదిద్దిన నూతన ఎథర్‌ స్పేస్‌, వినియోగదారులకు వాహనానికి సంబంధించిన ప్రతి అంశమూ తెలుసుకునే అవకాశం అందించడంతో పాటుగా వాహనంలోని వివిధ భాగాలకు సంబంధించి సమగ్రమైన అవగాహన కల్పించేందుకు స్ట్రిప్డ్‌ –బేర్‌ యూనిట్‌ను సైతం ప్రదర్శనకుంచారు. వినియోగదారులు టెస్ట్‌ రైడ్‌ స్లాట్స్‌ను ఎథర్‌ ఎనర్జీ వెబ్‌సైట్‌పై ఈ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాలను సందర్శించక మునుపే బుక్‌ చేసుకోచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఎథర్‌ ఎనర్జీకు మొట్టమొదటి ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రమిది.

Ather Energy begins retail operations in Visakhapatnam
Ather Energy begins retail operations in Visakhapatnam

ఈ సంవత్సరారంభంలో,ఎథర్‌ తమ కార్యకలాపాలను 15 నగరాలకు విస్తరించింది.వీటిలో ముంబై,పూనె, హైదరాబాద్‌,కొచి, అహ్మదాబాద్‌,న్యూఢిల్లీ, త్రిచి, జైపూర్‌ ఉన్నాయి.చార్జింగ్‌ మౌలికవసతులను ఏర్పాటుచేసేందుకు సైతం పెట్టుబడులు పెట్టిన అతి కొద్ది ఓఈఎంలలో ఒకటి ఎథర్‌ ఎనర్జీ. ఈ కంపెనీ రెండు ఫాస్ట్‌ చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటుచేసింది. ఇవి రైల్వే న్యూ కాలనీ,బీచ్‌ రోడ్‌లో ఉంటాయి. ఎథర్‌ ఎనర్జీ ఇప్పుడు మరో 8–10 చార్జింగ్‌ పాయింట్లను తమ చార్జింగ్‌ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకునేందుకు,నగరంలోని ఈవీ యజమానులకు మృదువైన, ఒత్తిడిలేని సవారీలను అందించేందుకు ఏర్పాటుచేయనుంది. వీటితో పాటుగా వినియోగదారులు హోమ్‌ చార్జింగ్‌ పరిష్కారాలను అపార్ట్‌మెంట్లు, బిల్డింగ్స్‌ వద్ద ఏర్పాటుచేసుకునేందుకు కూడా ఎథర్‌ ఎనర్జీ సహాయపడుతుంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, రాష్ట్రంలో విద్యుత్‌ వాహనాల స్వీకరణ, తయారీని వేగవంతం చేసేందుకు పలు పాలసీలను పరిచయం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలను వినియోగదారులకు అందిస్తుంది. వీటిలో నూతనంగా కొనుగోలు చేసిన ఈవీలకు 100% రోడ్‌ ట్యాక్స్‌ మినహాయింపు వంటివి సైతం ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ యొక్క ఈవీ పాలసీ, విద్యుత్‌ వాహనాలకు సంబంధించి ప్రతి అంశంలోనూ మద్దతునందిస్తుంది మరియు ఈవీల స్వీకరణ వేగవంతం చేయడంపై దృష్టి సారించింది.ఎథర్‌ 459 ఎక్స్‌ నూతనధర ఫేమ్‌ 2 సవరణ తరువాత విశాఖపట్నంలో 1,46,296 రూపాయలు కాగా, ఎథర్‌ 450 ప్లస్‌ ధర 1,27,916 రూపాయలు. సాధారణ 125 సీసీ మోటార్‌ సైకిల్‌ యాజమాన్యనిర్వహణ ఖర్చులను పరిగణలోకి తీసుకుంటే, ఎథర్‌ 450 ప్లస్‌ యజమానులు తమ పెట్టుబడిని 18–24 నెలల్లోనే బ్రేక్‌ ఈవెన్‌కు చేరుకోవడంతో పాటుగా రెండు సంవత్సరాల తరువాత కిలోమీటర్‌కు 2 రూపాయలు ఆదా చేయగలరు.

Ather Energy begins retail operations in Visakhapatnam
Ather Energy begins retail operations in Visakhapatnam

ఎథర్‌ ఎనర్జీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌, రవ్నీత్‌ ఫోకేలా మాట్లాడుతూ ‘‘ విశాఖపట్నంలో నూతన ఎక్స్‌పీరియన్స్‌ కేంద్ర ఏర్పాటుతో పాటుగా మా విస్తరణ ప్రణాళికలకు మద్దతునందించేందుకు ముందుకు వచ్చిన ఎస్‌ఎన్‌ ఆటో తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్ర ఏర్పాటులో అద్భుతమైన కృషిని ఎస్‌ఎన్‌ ఆటో చేసింది. అంతేకాదు నగరంలో టెస్ట్‌ రైడ్స్‌ నిర్వహించడంలోనూ అసాధారణ మద్దతునూ అందిస్తుంది. ఈ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రం వ్యూహాత్మక ప్రాంతంలో ఉండటంతో పాటుగా వినియోగదారుల సేవలు,మద్దతు సైతం వినియోగదారుల సమగ్ర అనుభవాలను పెంపొందించే రీతిలో ఉన్నాయి. మార్కెట్‌ నుంచి అద్భుతమైన స్పందనను మేము అందుకున్నాం,టెస్ట్‌ రైడ్‌ కోసం అభ్యర్థనలు సైతం గణనీయంగా పెరుగుతున్నాయి. అంతేకాదు, ఫేమ్‌ 2 సవరణలతో ఈవీల స్వీకరణ వేగం కూడా పెరిగింది. మా ఎథర్‌ లాంటి అత్యున్నత పనితీరు కలిగిన స్కూటర్‌ల ధరలు ఇదే తరహా ప్రమాణాలు కలిగిన (125 సీసీ)పెట్రోల్‌ స్కూటర్‌ల లాగానే ఉంటాయి. విశాఖపట్నం తరువాత, ఆంధ్రప్రదేశ్‌ లో మరో 3–4 నగరాలలో ఈ సంవత్సరాంతానికి విస్తరించనున్నాం’’ అని అన్నారు.

Ather Energy begins retail operations in Visakhapatnam
Ather Energy begins retail operations in Visakhapatnam

ఎన్‌ఎన్‌ ఆటో మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ సుధాకర్‌ నాగాలపాటి మాట్లాడుతూ ‘‘ భారతదేశంలో ఈవీ విప్లవానికి తోడ్పాటునందిస్తున్న ఎథర్‌ ఎనర్జీతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల ఎస్‌ఎన్‌ ఆటో చాలా సంతోషంగా ఉంది. వేగవంతమైన, స్మార్ట్‌ విద్యుత్‌ వాహనాలను నిర్మించడం మాత్రమే కాదు వినియోగదారుల కోసం మొత్తం వ్యవస్థను సైతం ఎథర్‌ ఎనర్జీ అభివృద్ధి చేసింది. ఎస్‌ఎన్‌ ఆటో వద్ద మేము హై పెర్‌ఫార్మెన్స్‌ విద్యుత్‌ స్కూటర్ల కోసం మా వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎథర్‌ 450 ఎక్స్‌ కోసం వినియోగదారుల నుంచి వస్తున్న స్పందన ప్రోత్సాహకరంగా ఉంది. మా వినియోగదారులకు అత్యున్నత కొనుగోలు అనుభవాలను అందించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’అని అన్నారు.