365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 19,2025: అగ్ని ప్రమాదాలను సమర్థంగా నియంత్రించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ ఫైర్ సేఫ్టీ విషయంలో అవగాహన కలిగి ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు. ఫైర్ సేఫ్టీ వారోత్సవాల సందర్భంగా హైడ్రా కార్యాలయంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
“ఒక్క అగ్ని ప్రమాదం కూడా జరగకూడదు అన్నదే మన లక్ష్యం. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే తప్పకుండా అగ్ని ప్రమాదాలను నివారించగలము,” అని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా చట్టాలను మరింత ప్రభావవంతంగా అమలు చేయాలని, క్షేత్రస్థాయిలో ఏర్పడే ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.
ఇది కూడా చదవండి..ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్‌కు సిద్దమైన ‘సూర్యాపేట జంక్షన్’
Read this also…‘Suryapet Junction’ Set for a Grand Theatrical Release on April 25
తాజాగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెల్లడైంది. ఈ నేపథ్యంలో, ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ తెలిపారు. ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకునే ప్రాంతాలపై వివరమైన డేటా ఉంటే, ప్రమాద నివారణ మరింత సమర్థవంతంగా చేయవచ్చన్నారు.

అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేలా షార్ట్ ఫిల్మ్‌లు, ప్రచార కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.
Read this also…Indkal Technologies Unveils Acer-Branded Smartphones in India with Segment-Leading Features
Read this also…Dr. Nawab Mir Nasir Ali Khan Honored with AsiaOne Diplomatic Excellence Award 2024-25
ఈ కార్యక్రమంలో హైడ్రా ఫైర్ విభాగం అదనపు సంచాలకులు పాపయ్య, హైడ్రా ఎస్పీ సుదర్శన్, రీజనల్ ఆఫీసర్ జయప్రకాశ్ పాల్గొని విలువైన సూచనలు చేశారు. ఆసుపత్రులు, కార్యాలయాలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై అవగాహన పెంచాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు.