Sun. Nov 10th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పుణె,ఏప్రిల్ 30,2024 : భారతదేశపు అతి పెద్ద ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థల్లో ఒకటైన బజాజ్ అలయంజ్ లైఫ్ వరుసగా 23వ ఏడాది బోనస్‌లు ప్రకటించింది!

కంపెనీ పార్టిసిపేటింగ్ ప్రోడక్టుల్లో ఇన్వెస్ట్ చేసిన 11.66 లక్షల మంది పైచిలుకు పాలసీదారులకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది. 2024 ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ రూ. 1,383 కోట్ల బోనస్ ప్రకటించింది. సంస్థ ఇప్పటివరకు ప్రకటించిన బోనస్‌లలో ఇదే అత్యధికం.

సంప్రదాయ పార్టిసిపేటింగ్ (విత్-ప్రాఫిట్) పాలసీలు గల పాలసీదారులు ఈ బోనస్ పొందడానికి అర్హులుగా ఉంటారు. పార్టిసిపేటింగ్ ఫండ్స్ (విత్-ప్రాఫిట్స్)లో మిగులు మొత్తం నుంచి ఈ బోనస్ ప్రకటించింది.

2024 మార్చి 31 నాటికి అమల్లో ఉన్న పాలసీలన్నింటికి దీన్ని పొందడానికి అర్హత ఉంటుంది. బజాజ్ అలయంజ్ లైఫ్ ఫ్లెక్సి ఇన్‌కం గోల్, బజాజ్ అలయంజ్ ఎలీట్ అష్యూర్, బజాజ్ అలయంజ్ లైఫ్ ఏస్ వంటి పార్టిసిపేటింగ్ ప్రోడక్టులను తీసుకున్న పాలసీదారులకు దీనితో ప్రయోజనం చేకూరనుంది.

2023 ఆర్థిక సంవత్సరంలో ప్రకటించిన రూ. 1,201 కోట్లతో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సర బోనస్ 15 శాతం అధికం.

“రెండు దశాబ్దాలకు పైగా కార్యకలాపాలు సాగిస్తున్న మా సంస్థ చరిత్రలోనే అత్యధిక స్థాయి బోనస్‌లలో ఇది ఒకటి. దీన్ని ప్రకటించడం సంతోషంగా ఉంది. మా కస్టమర్ల దీర్ఘకాలిక జీవిత లక్ష్యాల సాధనలో వారికి అన్ని విధాలా తోడ్పాటు అందించడంపై మాకు గల నిబద్ధతకు ఇది నిదర్శనం.

ప్రతి సంవత్సరం మా కస్టమర్లను వారి జీవిత లక్ష్యాలకు మరింత చేరువగా చేర్చే విధంగా మా విలువైన ఉత్పత్తులు, పెట్టుబడి వ్యూహాలు ఉంటాయి. బోనస్‌ల ప్రకటన ఆ దిశగా ఒక కీలకమైన అడుగు.

మా కస్టమర్లను వారి జీవిత లక్ష్యాలకు చేర్చేందుకు కృషి చేయడాన్ని మేము నిరంతరం కొనసాగిస్తాం. అలాగే మాపై వారు ఉంచిన విశ్వాసానికి ఇలాంటి బోనస్‌ల ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం” అని బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ & సీఈవో శ్రీ తరుణ్ చుగ్ తెలిపారు.

ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రకటించే బోనస్‌లు చివరి వరకు పోగై, పాలసీ మెచ్యూరిటీ లేదా నిష్క్రమణ సమయంలో అందించాయి. అదనంగా పాలసీ నిబంధనలకు లోబడి పాలసీలో పేర్కొన్న నిర్దిష్ట సందర్భాల్లో నగదు బోనస్‌లు కూడా చెల్లించనున్నాయి.

Also read:Bajaj Allianz Life Announces its highest-ever bonus for their participating products

ఇది కూడా చదవండి: కరెరా సమ్మర్ కలెక్షన్‌ విడుదల చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్..

Also read: PAT CUMMINS, THE BRAND AMBASSADOR OF CARRERA & CAPTAIN OF SUNRISERS HYDERABAD LAUNCHED A NEW SUMMER COLLECTION

Also read: Freedom Healthy Cooking Oils and Election Commission join hands for Voter Participation Drive for Lok Sabha Elections 2024

Also read: Mahindra launches the XUV 3XO – the ‘New Disruptor’in compact SUVsPrices start at₹7.49 Lakh..

Also read: Tata Chemicals Limited financial results for the quarter and full year ended March 31, 2024

Also read: ROBUST OVERALL PERFORMANCE, PROPELLED BY GROWTH ACROSS DIVERSIFIED BUSINESSES AND MARGIN EXPANSION

Also read:BE’S PNEUBEVAX 14TM SAFE & IMMUNOGENIC IN 6-8-WEEK OLD INFANTS

error: Content is protected !!