Mon. May 20th, 2024

365తెలుగు డాట్ కామ్ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 12, హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా ఇంట్లో నుంచి బాటకు వెళ్లాలంటే అందరు గడగడలాడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో అత్యవసరం ఉంటే తప్ప బయటకు అడుగు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో నే బ్యాంకు ఖాతాలో న‌గ‌దు నిల్వ గురించి తెలుసుకునేందుకు బ్యాంకుల‌కు వెళ్లే రోజులు పోయాయి. మీ బ్యాంకు ఖాతాకు మొబైల్ నంబ‌రును న‌మోదు చేయించుకుంటే చాలు… వెంటనే… ఒక్క మిస్డ్ కాల్‌తో ఖాతాలో న‌గ‌దు నిల్వ‌ను తెలుసుకోవ‌చ్చు. ఈ స‌దుపాయాన్ని గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా దాదాపు అన్ని ప్ర‌భుత్వ/ప్రయివేటు బ్యాంకులు క‌ల్పిస్తున్నాయి. బ్యాంకింగ్ సేవ‌ల తీరుతెన్నులు క్ర‌మంగా మారుతున్నాయి. మొద‌ట్లో ఏటీఎమ్‌ బ్యాంకింగ్, త‌ర్వాత ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌, ప్ర‌స్తుతం మొబైల్ బ్యాంకింగ్ ఇలా బ్యాంకులు త‌మ పంథాను ఎప్ప‌టిక‌ప్పుడు మార్చుకుంటున్నాయి. ఒక‌వేళ ఇదివ‌ర‌కూ ఖాతాతో మీ మొబైల్ నంబ‌రును అనుసంధానించి ఉండ‌క‌పోతే బ్యాంకు శాఖ‌కు వెళ్లి న‌మోదు చేయించుకోవాలి.

bank balance cheking through missed call numbers
bank balance cheking through missed call numbers

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
న‌మోదు కోసం REG Account number టైప్‌ 09223488888 నంబ‌రుకు సంక్షిప్త సందేశాన్ని పంపాలి.
ఖాతా న‌గ‌దు విచార‌ణ కోసం 09223766666 నంబ‌రుకు మిస్‌డ్‌కాల్ ఇవ్వాలి
మినీ స్టేట్‌మెంట్ కోసం అయితే 09223866666 నంబ‌రుకు మిస్‌డ్‌కాల్ ఇవ్వాలి

ఐసీఐసీఐ బ్యాంక్‌
ఐసీఐసీఐ వినియోగ‌దారులు ఖాతాలోని న‌గ‌దు నిల్వ‌ను తెలుసుకోవాలంటే 02230256767కు కాల్ చేయాలి.

యూనియ‌న్ బ్యాంక్ ఆప్ ఇండియా
మీ ఖాతాలోని న‌గ‌దు నిల్వ‌ను తెలుసుకునేందుకు 09223008586కు మిస్‌డ్‌కాల్ ఇవ్వాలి.

ఆంధ్రా బ్యాంక్
ఆంధ్రా బ్యాంక్ ఖాతాదార్లు 09223011300 నంబరుకు మిస్‌డ్‌కాల్ ఇవ్వ‌డం ద్వారా న‌గ‌దు నిల్వ‌ను తెలుసుకోవ‌చ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
హెచ్‌డీఎప్‌సీ మిస్‌డ్‌కాల్ బ్యాంకింగ్ ద్వారా కింది సౌక‌ర్యాలు ఉన్నాయి.
ఖాతాలోని న‌గ‌దు నిల్వ‌ను తెల‌సుకునేందుకు 18002703333కు కాల్ చేయాలి
మినీ స్టేట్‌మెంట్ కోసం 18002703355కు కాల్ చేయాలి
చెక్కు పుస్తకం అభ్య‌ర్థ‌న కోసం 18002703366కు కాల్ చేయాలి
అకౌంట్ స్టేట్‌మెంట్ కోసం 18002703377కు కాల్‌చేయాలి

bank balance cheking through missed call numbers
bank balance cheking through missed call numbers

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా
ఖాతాలో న‌గ‌దు నిల్వ‌ను తెలుసుకునేందుకు 8468 00 1111మిస్‌డ్ కాల్ ఇవ్వాలి
మినీ స్టేట్‌మెంట్ కోసం 8468 00 1122 నంబ‌రుకు మిస్‌డ్ కాల్ ఇవ్వాలి

కార్పొరేష‌న్ బ్యాంక్‌
దేశంలో ఉండే వినియోగ‌దారులు ఖాతాలో న‌గ‌దు నిల్వ తెలుసుకోవాలంటే 09268892688కు కాల్ చేయాలి
విదేశాల్లో ఉండే వినియోగ‌దారులు ఖాతాలో న‌గ‌దు నిల్వ తెలుసుకోవాలంటే – 919268892688కు కాల్ చేయాలి.

ఇండియ‌న్ ఓవ‌ర్‌సీస్ బ్యాంక్‌
బ్యాంకు వ‌ద్ద న‌మోద‌యిన మొబైల్ నంబ‌రు నుంచి 04442220004కు కాల్ చేయాలి.

విజ‌యా బ్యాంక్‌
న‌గ‌దు నిల్వ‌ను తెల‌సుకునేందుకు 1800 103 5525
మినీ స్టేట్‌మెంట్ కోసం 1800 103 5535

యూకో బ్యాంక్‌
ఖాతాలోని న‌గ‌దు విచార‌ణ కోసం 092787 92787 నంబరుకు కాల్ చేయాలి.

యాక్సిస్ బ్యాంక్‌
1800 419 5959 నంబరుకు కాల్‌చేయ‌డం ద్వారా ఖాతాలో ఉన్న న‌గ‌దు వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు.

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్
1800 180 2222 / 1800 103 నంబ‌ర్ల‌కు మిస్‌డ్‌కాల్ ఇవ్వ‌డం ద్వారా సంక్షిప్త సందేశంలో న‌గ‌దు నిల్వ‌ను తెలుసుకోవ‌చ్చు.

ఐడీబీఐ బ్యాంక్
09212993399కు మిస్‌డ్‌కాల్ ఇవ్వ‌డం ద్వారా లేదా BAL అని మెసేజ్ పంప‌డం ద్వారా ఖాతాలోని న‌గ‌దు నిల్వ‌ను తెలుసుకోవ‌చ్చు.

దేనా బ్యాంక్‌
09289356677కు కాల్ చేసి సంక్షిప్త సందేశ రూపంలో ఖాతాలోని న‌గ‌దు ఎంతుందో తెలుసుకోవ‌చ్చు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదార్లు 09015135135/ 09266135135 మిస్‌డ్‌కాల్ ఇవ్వ‌డం ద్వారా ఖాతా న‌గ‌దు స‌మాచారాన్ని తెలుసుకోవ‌చ్చు.

సౌత్ ఇండియ‌న్ బ్యాంక్‌
09223008488కు కాల్ చేయాలి.

ఇండియ‌న్ బ్యాంక్‌
ఖాతా న‌గ‌దు నిల్వ‌ను తెలుసుకునేందుకు 092895-92895కు కాల్ చేయాలి.

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
గ‌త మూడు లావాదేవీల‌కు సంబంధించిన మినీ స్టేట్‌మెంట్ కోసం 09555144441కు మిస్‌డ్‌కాల్ ఇవ్వాలి.
ఖాతా న‌గ‌దు విచార‌ణ కోసం 09555244442 నంబ‌రుకు మిస్‌డ్ కాల్ ఇవ్వాలి.

సిండికేట్ బ్యాంక్‌
మొబైల్ బ్యాంకింగ్ కోసం రిజిస్ట‌ర్ అయ్యేందుకు SREG స్పేస్ క‌స్ట‌మ‌ర్ ఐడీని 09241442255కు పంపాలి.
న‌మోద‌యిన వినియోగ‌దారులు 09241442255 లేదా 08067006979 నంబ‌ర్ల‌కు మిస్‌డ్‌కాల్ ఇవ్వ‌డం ద్వారా న‌గ‌దు నిల్వ‌ను తెలుసుకోవ‌చ్చు

ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్‌
న‌గ‌దు విచార‌ణ కోసం ACBALAccountnumber” అని 09915622622కు సందేశాన్ని పంపాలి.
మినీ స్టేట్‌మెంట్ కోసం “STMAccountnumber” అని 09915622622కు సందేశాన్ని పంపాలి.

యునైటెడ్ బ్యాంక్ ఆప్ ఇండియా
ఖాతా న‌గ‌దు నిల్వ‌ను తెలుసుకునేందుకు 09015431345కు మిస్‌డ్‌కాల్ ఇవ్వాలి.

యెస్ బ్యాంక్‌
09223920000కు మిస్‌డ్‌కాల్ ఇవ్వ‌డం ద్వారా ఖాతాలో న‌గ‌దు ఎంతుందో తెలుసుకోవ‌చ్చు.