365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 11,2025: బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల్లో మొత్తం 400 ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అర్హులైన అభ్యర్థులు మార్చి 15, 2025 లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత,వయస్సు పరిమితి..
ఇది కూడా చదవండి…WPL 2025: గుజరాత్‌పై ముంబైకి వరుసగా ఆరో విజయం
ఇది కూడా చదవండి…పాసుపుస్తకాలతో పాత లే ఔట్ల కబ్జాలు.. హైడ్రా ప్రజావాణికి అందిన 63 ఫిర్యాదులు..
ఈ నియామకానికి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు అర్హులు. వయస్సు పరిమితి విషయానికి వస్తే, జనవరి 1, 2025 నాటికి అభ్యర్థి కనీసం 20 సంవత్సరాలు, గరిష్టంగా 28 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు
దరఖాస్తు సమయంలో అభ్యర్థులు వర్గాల వారీగా ఫీజు చెల్లించాలి.
జనరల్, ఓబీసీ, EWS అభ్యర్థులకు: ₹800
SC/ST అభ్యర్థులకు: ₹600
మహిళా అభ్యర్థులకు: ₹600
దివ్యాంగులకు (PH కేటగిరీ): ₹400
దరఖాస్తు విధానం..
అధికారిక వెబ్‌సైట్ bfsissc.com/boi.php ని సందర్శించాలి.
Apply through NATS Portal పై క్లిక్ చేయాలి.
కొత్త అభ్యర్థులు రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా మొదటిగా రిజిస్టర్ చేసుకోవాలి.
ఆ తర్వాత వివరాలు నమోదు చేసి, దరఖాస్తును పూర్తి చేయాలి.
చివరిగా అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్‌ను సమర్పించాలి.
దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకుని భద్రపర్చుకోవాలి.
ఇది కూడా చదవండి…మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా శ్రీలీలకు ప్రత్యేక సన్మానం
ఇది కూడా చదవండి…విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకుంటారా..?
సెలెక్షన్ ప్రాసెస్.. ?

అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్ రిటెన్ టెస్ట్ రాయాలి…
ఈ పరీక్షలో కట్‌ఆఫ్ మార్క్స్ సాధించిన అభ్యర్థులను లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కు ఎంపిక చేస్తారు. ఆపై అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్టును రూపొందించి ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు.. !