Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,మే 11, 2024 : తిరుమల శ్రీవారి ఆలయంలో మే 12వ తేదీన ఆదివారం భాష్యకార్ల సాత్తుమొర జరుగనుంది. ఈ ఉత్సవం సందర్భంగా మే 3 నుంచి 21వ తేదీ వ‌ర‌కు 19 రోజులపాటు ఉభయం సమర్పణ జరుగుతోంది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.

శ్రీ భాష్యకార్ల సాత్తుమొర సందర్భంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీభాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. రాత్రి 7.30 నుంచి 9.30 గంటల వరకు భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపడతారు. జీయర్‌స్వాములు, ఏకాంగులు తదితరులు పాల్గొంటారు.

ఇది కూడా చదవండి: గంగా ఎంటర్టైన్మంట్స్ ‘శివం భజే’ ఫస్ట్ లుక్ విడుదల

Also read : ‘Shivam Bhaje’: First Look has Ashwin Babu showing his explosive rage!

ఇది కూడా చదవండి: ఓటు వేసిన వారికీ వండర్లా హైదరాబాద్ పార్క్ టిక్కెట్లపై 20% తగ్గింపు

Also read : Cast your vote and get 20% off on Wonderla Hyderabad Park tickets!

ఇది కూడా చదవండి: వేసవి శిబిరాన్ని ప్రారంభించిన స్కోడా ఇండియా

ఇది కూడా చదవండి: రూ.15వేల లోపు 5G స్మార్ట్‌ఫోన్స్..జాబితా..

ఇది కూడా చదవండి: 2024… జగనన్న వన్స్ మోర్

ఇది కూడా చదవండి: పురూహుతికా అమ్మవారిని దర్శించుకున్నరామ్ చరణ్