365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 3,2025: సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 50 వేల రూపాయల పూచికత్తుతో పాటు రెండు షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు, కోర్టులో ప్రస్తావించిన వాదనలతో బట్టి, కోర్టు అభిప్రాయాన్ని మార్చుకుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో A-11గా ఉన్న అల్లు అర్జున్ పై నమోదైన కేసులో, అతనికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది.
అల్లు అర్జున్ పై పెట్టిన BNS 105 వర్తించదని, సంధ్యా థియేటర్ ఘటనలో మహిళ మృతికి అతనికి సంబంధం లేదని న్యాయవాదులు కోర్టుకు వాదించారు.
ఇప్పటికే హై కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం కూడా నాంపల్లి కోర్టుకు తెలియచేసింది.
ఇరు వాదనలను వినిపించిన తర్వాత, నాంపల్లి కోర్టు హీరో అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేసింది.