365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2,2024: 32ఏళ్లకే పూనమ్ పాండే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తో చనిపోయినట్లు పూనమ్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె మేనేజర్ వెల్లడించారు.
సర్వైకల్ క్యాన్సర్‌తో ఆమె మృతి చెందినట్లు మేనేజర్ చెప్పారు. పూనమ్ పాండే ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించింది.
నటి , మోడల్ అయిన పూనమ్ పాండే 2013లో నషా సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మూడు రోజుల క్రితం పూనమ్ పాండే తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేశారు.

అందులో ఆమె గోవాలో జరిగిన క్రూయిజ్ పార్టీలో కనిపించింది. ఆ పార్టీ సమయంలో ఆమె పూర్తిగా ఫిట్‌గా కనిపించింది. ఇంతలోనే ఇలా జరగడంతో పూనమ్ ఫాన్స్ షాక్ అవుతున్నారు.
శుక్రవారం ఉదయం 32 ఏళ్ల పూనమ్ పాండే కన్నుమూసింది. పూనమ్ పాండే మరణానికి కారణం సర్వైకల్ క్యాన్సర్ అని అంటున్నారు. దేశంలో సర్వైకల్ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారు.