365తెలుగు డాట్ ఆన్ లైన్ న్యూస్ , ఏప్రిల్ 28,2025: ఇటీవల థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన మలయాళ హాస్య చిత్రం ‘బ్రొమాన్స్’ ఇప్పుడు సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. మే 1 నుంచి ప్రత్యేకంగా అందుబాటులోకి రానున్న ఈ చిత్రం, హాస్యం, యాక్షన్, స్నేహం, హృదయాన్ని తాకే భావోద్వేగ సన్నివేశాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుంది.

థియేటర్లో చూడలేకపోయిన వారు, ఇప్పుడు ఈ సినిమా ని ఇంట్లోనే ఆస్వాదించవచ్చు. చిత్ర దర్శకుడు అరుణ్ డి.జోస్ మాట్లాడుతూ, “థియేటర్లలో మా సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికి మనఃపూర్వక కృతజ్ఞతలు. ‘బ్రొమాన్స్’ ఒక అందమైన స్నేహ గాథ. ఇందులో డ్రామా, సస్పెన్స్ మేళవింపుతో, ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే కథను రూపొందించాం.

మే 1 నుంచి సోనీ లివ్‌లో విడుదలవుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మరింత మంది ప్రేక్షకుల మన్ననలు పొందాలని ఆశిస్తున్నాం.” అని పేర్కొన్నారు.

కథాసారాంశం: బింటో అనే యువకుడి చుట్టూ తిరిగే ఈ కథలో, అతడు తన సోదరుడి స్నేహితులతో కలిసి కనిపించకుండా పోయిన సోదరుడిని వెతుకుతాడు. కథంతా ఒక రాత్రిలోనే నడవడం ప్రత్యేకత. అనూహ్య మలుపులు, మధుర జ్ఞాపకాలతో నిండిన ఈ యాత్ర ప్రేక్షకులను తడిమి పోయేలా చేస్తుంది.

నటీనటులు: ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, భరత్ బోపన్న, శ్యామ్ మోహన్, మహిమ నంబియార్, మాథ్యూ థామస్, కలభవన్ షాజోన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నిర్మాత: అషిక్ ఉస్మాన్ కథ: అరుణ్ డి.జోస్, రవీష్ నాథ్, థామస్ పి. సెబాస్టియన్