Fri. Sep 20th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 24,2024:కాగ్నిజెంట్ అనుబంధ సంస్థ అయిన ట్రైసెటో, తన ఆరోగ్య బీమా సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేసిన ఆరోపణలతో భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై కోర్టు దావా వేసింది.

టెక్సాస్ ఫెడరల్ కోర్టులో ఫిర్యాదు నమోదు చేయగా, కాగ్నిజెంట్‌ ఇన్ఫోసిస్ డేటా చట్టవిరుద్ధంగా సంపాదించిందని,దాని ఆధారంగా ‘టెస్ట్ కేసెస్ ఫర్ ఫేసెస్’ అనే ప్రత్యర్థి ఉత్పత్తిని రూపొందించడానికి ట్రైసెటో సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేసిందని పేర్కొంది. ఈ దావా ద్వారా కాగ్నిజెంట్ పరిహారం కోరుతోంది . వారి వ్యాపార రహస్యాలను ఉపయోగించడాన్ని మానుకోవాలని కోరింది.

ట్రైసెటో అభివృద్ధి చేసిన కాగ్నిజెంట్ సాఫ్ట్‌వేర్, హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ కంపెనీలు విస్తృతంగా ఉపయోగించే ఫేసెస్,QNXT ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉంది, ఇది కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడుతుంది.

అయితే, ఇన్ఫోసిస్ ఈ ఆరోపణలను ఖండించింది. ఇన్ఫోసిస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, తమపై మోసాలన్నింటిని ఖండిస్తున్నామని, వాటిని కోర్టులో ఎదుర్కొంటామని చెప్పారు.

రెండు కంపెనీల మధ్య పలు సంవత్సరాల నుంచి పోటీ కొనసాగుతోంది. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ తన ఉద్యోగులను అన్యాయంగా తీసుకుంటోందనే ఆరోపణలు లేవనెత్తింది.

మాజీ ఇన్ఫోసిస్ అధికారి రాజేష్ వారియర్‌ను కొత్త సీఎండీగా నియమించిన ఒక వారానికి ముందు, కాగ్నిజెంట్ ప్రస్తుత CEO రవి కుమార్‌కు కూడా ఇన్ఫోసిస్‌తో గత అనుబంధం ఉంది.

error: Content is protected !!