Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 19,2023: నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీబీఎస్సీ నేషనల్ ఏరోబిక్స్ ఛాంపియన్‌షిప్ 2023 ప్రారంభోత్సవ వేడుక అక్టోబర్ 18న సగర్వంగా జరిగింది. ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్‌లో దేశం నలుమూలల నుంచి 80-100 పాఠశాలలు పాల్గొన్నాయి.

దాదాపు 1000 మంది ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

స్కూల్ సీనియర్ ప్రిన్సిపాల్ శ్రీమతి సునీతారావు కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథి ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ హెచ్ఓడీ సీనియర్ ప్రొఫెసర్ బి.సునీల్ కుమార్, ఇతర కోచ్‌లు, పాల్గొనేవారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

తర్వాతఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ,పల్లవి మోడల్ స్కూల్స్ చైర్మన్ మల్కా కొమరయ్య, సీఓఓ మల్కా యశస్వి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసి, యువ క్రీడాకారులను చైతన్యపరిచారు.

భక్తిపూర్వక ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమం లాంఛన ప్రాయంగా ప్రారంభమైంది, ఇది భక్తి ,దృఢ సంకల్పం సౌరభాన్ని సృష్టించింది. 8వ తరగతికి చెందిన గౌతమి చేసిన శాస్త్రీయ నాట్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఎర్లీ ఇయర్స్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి రెబెక్కా సిన్హా కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖుల ప్రొఫైల్‌లను చదివి వారికి సాదర స్వాగతం పలికారు.

క్రీడా రంగానికి వారు చేసిన సేవలకు తగిన గౌరవం , గుర్తింపును గుర్తిస్తూ సత్కరించారు. డీపీఎస్ జెండాను అతిథులంతా సగర్వంగా ఎగురవేశారు. అనంతరం ప్రసంగాలు సభికులను ఆకట్టుకున్నాయి. డీపీఎస్ నాచారం డ్యాన్స్ టీమ్ స్పెల్‌బైండింగ్, ఫుట్-ట్యాపింగ్ ఏరోబిక్స్ ప్రదర్శన జరగబోయే పోటీకి వేదికను సిద్ధం చేసింది.

ముఖ్య అతిథి అయిన ప్రొఫెసర్ కె. దీప్లా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పాల్గొన్న కోచ్‌లు , పాల్గొనేవారి క్రీడాస్ఫూర్తి, ఫెయిర్ ప్లే స్ఫూర్తిని నొక్కిచెబుతూ ప్రమాణం చేశారు.

పోటీకి ముందు, డీపీఎస్ నాచారం ఫిజికల్ ఇన్‌స్ట్రక్టర్‌లు, కోచ్‌లు పాల్గొనేవారికి కీలకమైన సూచనలను అందించారు. సీబీఎస్సీ నేషనల్ ఏరోబిక్స్ ఛాంపియన్‌షిప్ 2023 ఉత్తేజకరమైన ప్రయాణాన్ని ప్రారంభించింది.