Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 7,2024: జగనన్న పాలనలో అమలు చేస్తున్న పథకాలను చంద్రబాబు ఫిర్యాదుతో నిలిపివేసిన ఈసీ. చంద్రబాబు పేదలపై పగపట్టాడు. పేదలకు సంక్షేమ పథకాలను ఇవ్వకుండా అడ్డుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు.

మొన్నటి మొన్న వృద్దులకు పెన్షన్లు అందకుండా చేసిన చంద్రబాబు ఇపుడు జగనన్న ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పేదలకు చేరకుండా అడ్డుకుంటున్నాడు.

జగనన్న ప్రభుత్వంలో అమలవుతున్న విద్యార్ధుల ఫీజు రీ ఎంబర్స్ మెంట్, విద్యాదీవెన, ఇన్ పుట్ సబ్సిడీ వంటి పథకాలను పేదలకు చేరకుండా ఈసీకి ఫిర్యాదులు చేసి పేదల జీవితాలతో ఆటలాడు కుంటున్నాడు.

దీంతో సంక్షేమ పథకాలకు నిధులు విడుదల కాకుండా ఈసీ కి ఫిర్యాదు చేశాడు. ఫలితంగా తుఫాను, కరువు కారణంగా దెబ్బతిన్న రైతులకు అందే సబ్సిడీ ఇవ్వడానికి ఈసీ మోకాలడ్డింది.

మరోపక్క ఖరీఫ్ కు సన్నద్దమవుతున్న రైతులకు అందే సబ్సిడీ నిలిచిపోయింది. విద్యార్ధులకు ఇచ్చే ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు నిలిచిపోయాయి. చంద్రబాబును తరిమేసే రోజులు ఆసన్నమవుతున్నాయి.

ఒక్క నెల రోజులు ఓపిక పడితే మళ్ళీ జగనన్న పాలనలో మరోసారి పేదలు జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి.

Also read: Lupin Q4 FY2024 Results

ఇది కూడా చదవండి:ఎల్లోమీడియా కుట్రలో పీవీ రమేష్ ల్యాండ్ టైట్లింగ్ చట్టం మీద ట్వీట్ వెనువెంటనే దిద్దుబాటు…