365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 17,2025: చదివినవి రాయగలమన్న నమ్మకమే పరీక్షా భయానికి విరుగుడని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా. హిప్నో పద్మా కమలాకర్ అన్నారు .బాగ్ లింగం పల్లి మైనారిటీ గురుకుల్ స్కూల్ హెచ్ ఎం వాణిశ్రీ ఆధ్వర్యంలో సోమవారం పదవతరగతి విద్యార్థులకు డా.హిప్నో పద్మా కమలాకర్ పరీక్షలపై అవగాహన కల్పించారు.”
ఆమె మాట్లాడుతూ పరీక్షల సమయం వచ్చిందంటే – కొంత మందికి టెన్షన్, మరికొందరికీ భయం, ఇంకొందరికీ బోర్ అని తెలిపారు! కానీ, ఈ భయాలన్నిటికీ ఒకే ఒక్క మందు ఉంది – “నేను చదివినవి రాయగలను!” అనే నమ్మకమే నన్నారు.

పరీక్షలంటే భయం కాదు, పరీక్షలంటే ఓ ఛాలెంజ్ అన్నారు. సరైన ప్రిపరేషన్‌తో, స్మార్ట్ స్టడీ టెక్నిక్స్‌తో ముందుకు వెళితే, ఏ పరీక్షయైన కష్టంగా అనిపించదన్నారు. పరీక్షల ముందు మనసు నిశ్చలంగా ఉంచి చదివినదాన్ని నమ్మాలన్నారు.టెన్షన్‌తో చదివితే టెంపో నశించిపోతుంది. అందుకే హాయిగా స్టడీ చేయండి! చదివినది రాయడం ప్రాక్టీస్ చేయండి. మొదట ప్రశ్నల్ని ఒకసారి చదవండి, ఆ తర్వాత వాటిని ఎలా రాయాలో ప్లాన్ చేసుకోండి.నిద్ర, భోజనం ఖచ్చితంగా చేయండి.
Read this also…India’s Growing Global Influence in 2025..
Read this also…The World’s 10 Most Powerful Countries in 2025: India’s Rising Influence
తగిన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం లేకపోతే మెదడు నిద్రలోనే ఉంటుంది.నేను చదివాను!” “నేను రాయగలను!””నేను విజయం సాధిస్తాను!” అనుకుంటే పరీక్షల భయం నిమిషాల్లో కరిగిపోతుందన్నారు. అభ్యాసమే విజయానికి మూలం అని సంకల్పంతో చదివి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయమని చెప్పారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందన్నారు.
పదవతరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరూ స్ట్రెస్సుకి గుడ్‌బై చెప్పి, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని! ఆల్ ది బెస్ట్! అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ డా.కె.విజయ కుమార్, లయన్ పి.స్వరూపా రాణి, జయశ్రీ పాల్గొన్నారు.